అంతర్జాతీయం

ఐరాసలో గణతంత్ర వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 27: భారత 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఐక్యరాజ్యసమితిలో కోలాహలంగా నిర్వహించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మండలి’లో శాశ్వత సభ్యత్వం ఉన్న అమెరికా ప్రతినిధి మాత్రం హాజరు కాలేదు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ స్థానికంగా లేకపోవడంతో హాజరు కాలేదు. అయితే, ఆమె తరఫున ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. ఐరాసలో జరిగిన గణతంత్ర సంబరాలకు పెద్ద సంఖ్యలో ఇండియన్ అమెరికన్లు, పలు దేశాలకు చెందిన దౌత్య అధికారులు పాల్గొన్నారు. జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మిరోస్లావ్ లజ్‌కాక్, డిప్యూటీ యున్ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్, ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధి తదితరలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. వివిధ దేశాలకు చెందిన దౌత్యాధికారులు పాల్గొనడం పట్ల ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన తొలుత భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, అమెరికాలోని న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్‌కో, చికాగో, హూస్టన్, అట్లాంటా తదితర ప్రాంతాల్లోనూ భారతీయులు గణతంత్ర వేడుకలను జరుపుకున్నారు. కొన్ని చోట్ల అమెరికన్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొని భారతీయులను అభినందించారు.
బలపడిన భారత్-జపాన్ మైత్రి
గత ఏడాది కాలంలో భారత్‌తో తమ మైత్రీబంధం ఎంతో బలపడిందని జపాన్ విదేశాంగ మంత్రి టారో కొనొ అన్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాల విషయంలో 2017 చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆయన టోక్యోలో జరిగిన భారత గణతంత్ర వేడుకల్లో అన్నారు. జపాన్‌లోని భారత రాయబారి సుజన్ ఆర్ చినోయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు టారో హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో జపాన్, భారత్ భాగస్వాములవుతున్నాయని వివరించారు. భారత్‌లో జపాన్‌కు చెందిన ఎన్నో సంస్థలు వ్యాపారాలను నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు మరింతగా విస్తృతమవుతాయని ఆయన తెలిపారు.
చిత్రం..ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్
దినోత్సవ వేడుకల్లో రాష్టప్రతి ప్రసంగాన్ని వినిపిస్తున్న భారత శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్