అంతర్జాతీయం

కశ్మీరీల పోరాటానికి మద్దతు కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 5: కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించకుండా లోయలో శాంతి, శ్రేయస్సు సాధ్యం కావని, స్వీయనిర్ణయాధికారానికి కశ్మీరీ ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని పాకిస్తాన్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధానమంత్రి షాహిద్ ఖాకన్ అబ్బాసీ వేరువేరు సందేశాలలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్వయం నిర్ణయాధికారం కోసం ఆక్రమిత కశ్మీర్ ప్రజలు చేస్తున్న పోరాటానికి పాకిస్తాన్ రాజకీయ, నైతిక, దౌత్యపరమైన మద్దతును ఎటువంటి సందిగ్ధత లేకుండా కొనసాగిస్తుందని అధ్యక్షుడు హుస్సేన్ తన సందేశంలో పేర్కొన్నారు. కశ్మీర్‌లోని ప్రజలకు ఏడు దశాబ్దాలుగా స్వయం నిర్ణయాధికారం కలగానే మిగిలిందని, అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలు చేసినా ప్రాథమిక హక్కులు కలగానే మిగిలాయని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. మానవహక్కుల సంఘానికి చెందిన బృందాలు కశ్మీర్‌లో పర్యటించేందుకు ఇండియా అనుమతించడం లేదని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసే అవకాశాన్ని అడ్డుకుంటోందని విమర్శించారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలకు ఇండియా పాల్పడుతోందని, అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకొని మానవహక్కులను కాపాడవలసిందిగా ఇండియాపై ఒత్తిడి చేయాలని ఆయన కోరారు. కాగా కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్ సెలవు ప్రకటించింది. కశ్మీర్ వివాదానికి విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో ర్యాలీలు, సెమినార్ల వంటి కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించింది.

చిత్రం.ఆదివారం పాక్ కాల్పులకు పాల్పడిన నేపథ్యంలో రాజౌరీలోని.నియంత్రణ రేఖ వద్ద అప్రమత్తమైన భారత జవాన్లు