అంతర్జాతీయం

కవ్విస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 5: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద నజాపిర్, నికియల్, కరేలా సెక్టార్‌లో ఆదివారంనాడు భారత జవాన్ల కాల్పుల్లో తమ పౌరులు ఇద్దరు మృతి చెందారని పాక్ ఆరోపించింది. ఈ మేరకు ఇక్కడి భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌ను కలిసి పాక్ విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ (దక్షిణాసియా, సార్క్) మహ్మద్ ఫైజల్ నిరసన తెలిపారు. ఎల్‌ఓసీ వద్ద భారత భద్రతాదళాలు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. ‘్భరత దళాల కవ్వింపు చర్యలు ఏకపక్ష కాల్పులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఫైజల్ అన్నారు. భారత డిప్యూటీ హైకమిషనర్‌ను కలిసి తమ నిరసన తెలిపినట్టు పాక్ విదేశాంగ శాఖ సోమవారం నాడొక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 4న భారత్ కాల్పుల్లో రఫాఖత్ అలీ (18), తస్లీమ్ బేగం (25) మృతిచెందగా, ఇద్దరు చిన్నారులతోపాటు ఏడుగురు గాయపడ్డారని మహ్మద్ ఫైజల్ వెల్లడించారు. సరిహద్దు వెంబడి జనావాసాలను లక్ష్యంగా చేసుకుని భారత్ జవాన్లు కాల్పులకు తెగబడుతున్నారని పాక్ ఆరోపించింది. అత్యాధునిక ఆయుధాలతో కవ్వింపు చర్యలకు దిగడంతోపాటు కాల్పులు జరుపుతున్నారని డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 190 సార్లు కాల్పుల వివరణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయన ధ్వజమెత్తారు. భారత్ కాల్పుల్లో కనీసం 13 మంది చనిపోయారని ఆయన అన్నారు. గత ఏడాది నుంచీ భారత్ దళాలు నిత్యం ఏదో ప్రాంతంలో కాల్పులకు దిగుతూ తమను రెచ్చగొడుతోందని డీజీ చెప్పారు. జనావాసాలను లక్ష్యంగా చేసుకుని భారత్ పాల్పడుతున్న ఈ చర్యలు అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన, హక్కుల చట్టాలను కాలరాయడమేనని ఫైజల్ అన్నారు. అలాగే ఇలాంటి చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలు, సరిహద్దుల్లో భద్రతకు విఘాతం కలిగిస్తాయని పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో పరిస్థితిని అధ్యయనం చేడానికి యూఎన్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్‌ను అనుమతించాలని పాక్ కోరుతోంది. అలాగే 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని భారత్‌కు సలహా ఇచ్చింది.