అంతర్జాతీయం

జైనబ్ హంతకుడికి నాలుగు మరణ శిక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్, ఫిబ్రవరి 17: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఆరేళ్ల బాలిక జైనాబ్ అన్సారీపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో ముద్దాయి ఇమ్రాన్ అలీకి నాలుగు మరణ శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అపహరణ, అత్యాచారం, హత్య, తీవ్రవాద చర్యలకు పాల్పడ్డట్టు నిర్ధారిస్తూ నాలుగు మరణశిక్షలు విధించిన కోర్టు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న నేరానికి గాను యావజ్జీవ శిక్షతోపాటు భారీ జరిమానా విధించింది. కాగా తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు
పదిహేను రోజుల గడువిచ్చింది. దక్షిణ లాహోర్‌లోని కసూర్ పట్టణంలోని ఒక చెత్తకుండీలో జైనాబ్ మృతదేహం జనవరి 9న లభించింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ఆరేళ్ల జైనాబ్‌పై అత్యాచారం చేసి హతమార్చినది 24 సంవత్సరాల ఇమ్రాన్ ఇలీ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. జైనాబ్ ఇంటికి దగ్గర్లోనే ఉండే ఇమ్రాన్ ఆమెను అపహరించి ఆ తరువాత అత్యాచారం చేసి హత్య చేశాడు. కాగా అదే నెల 23న నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు తుదితీర్పును శనివారం వెలువరించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరైన మృతురాలి తండ్రి న్యాయమూర్తి తీర్పును విని కన్నీరుపెట్టాడు. జైనాబ్ హత్య అనంతరం పోలీసుల నిష్క్రియాపరత్వంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా పలుచోట్ల అల్లర్లు రేగాయి. ఆయా సంఘటనల్లో ఇద్దరు మరణించారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్‌లోని బాలికలపై లైంగికదాడులు, హత్యల కేసులతోనూ ఇమ్రాన్ అలీకి సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఏడాదికాలంగా అతడు అనేక నేరాలకు పాల్పడ్డాడని, అతడిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు, అధికారులు విఫలమయ్యారని విమర్శలు వచ్చాయి. కాగా జైనాబ్ కేసులో నిందితుడి తరపున వాదించిన న్యాయవాది కొద్దిరోజుల క్రితం ఆ కేసు నుంచి తప్పుకున్నాడు. కాగా కోర్టు తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత స్పందన వచ్చింది. జైనాబ్‌పై నేరానికి పాల్పడిన స్థలంలోనే నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలీపై మరణశిక్ష అమలు చేసేలోగా మిగతా సంఘటనలపై కూడా దర్యాప్తు పూర్తి చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. కాగా జైనాబ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పోలీసులు ఐదురోజుల పాటు స్పందించలేదని, ఆ తరువాత ఆమె మృతదేహం లభ్యమైందని తల్లిదండ్రులు ఆరోపించారు. అదృశ్యం కావడానికి ముందు జైనాబ్‌ను ఇమ్రాన్ తీసుకువెడుతున్న దృశ్యం సీసీటీవీలో రికార్డయింది. దీని ఆధారంగా నిందితుడిని గుర్తించారు.