అంతర్జాతీయం

ఇక సాగనివ్వను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అమెరికాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడతామని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడిక్కడ ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల ఫ్లోరిడా స్కూల్లో ఓ ఆగంతకుడు 17 మందిని దారుణంగా కాల్చి చంపిన నేపథ్యంలో ఈ తరహా ఘటనలను నిరోధించే అంశంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఓ సరికొత్త కార్యాచరణతో ముందుకొచ్చారు. ఈ తరహా దాడులకు పాల్పడే వారిని నిరోధించేందుకు వీలుగా టీచర్లకే ఆయుధాలు ఇవ్వాలన్న ఆలోచనను ఆయన తెరపైకి తెచ్చారు. ఫ్లోరిడా ఘటన నుంచి బయటపడ్డ అనేక మంది తమ ఆవేదనను వ్యక్తీకరిస్తూ తుపాకీ సంస్కృతికి శాశ్వతంగా తెరదించాలని ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ దాడిలో బయటపడ్డ వ్యక్తులు, చనిపోయినవారి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ట్రంప్‌కు గట్టిగానే తమ మనోభావాలను తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకమైన హింసాకాండ జరగడానికి వీల్లేదని, దాన్ని అరికట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తానని, మృతులకు రెండు నిమిషాలు వౌనం పాటించిన అనంతరం ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్ డైనింగ్ రూమ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముఖాముఖీగానే ట్రంప్‌తో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తుపాకీ సంస్కృతి కొనసాగడానికి వీలులేదని, అందుకు ప్రభుత్వపరంగా అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా అమెరికాలో ఈ రకమైన దాడులు పెరిగిపోతున్నాయని, అయితే ఎప్పటికప్పుడు వీటి నివారణకు సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో ఎంతమాత్రం లోపభూయిష్టంగా ఉండకూడదని స్పష్టం చేశారు. దేశంలో తుపాకుల విక్రయానికి సంబంధించి కఠిన విధానాన్ని అవలంబిస్తామని, ఏయే వయస్సు వారికి తుపాకులు అమ్మవచ్చో, వారి మానసిక స్థితిగతులు ఏమిటో కూడా నిర్ధారించుకున్న తర్వాతే వీటిని విక్రయించాలన్న విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.

చిత్రం..వైట్‌హౌస్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్