అంతర్జాతీయం

భూమికి తిరిగొచ్చిన ముగ్గురు వ్యోమగాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 18: అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో 186 రోజులపాటు అనేక ప్రయోగాలు నిర్వహించిన ముగ్గురు వ్యోమగాములు శనివారంనాడు భూమికి తిరిగివచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3.15 గంటలకు వీరు సూయుజ్ టిఎమ్‌ఏ-19ఎం అనే వ్యోమనౌకలో కజకిస్థాన్‌లో సురక్షితంగా దిగారు. వీరు స్పేస్ స్టేషన్‌లో బయాలజీ, బయో టెక్నాలజీ, భౌతికశాస్త్రం తదితర అంశాలపై ఎన్నో ప్రయోగాలు నిర్వహించినట్లు నాసా తెలిపింది. భూమికి తిరిగివచ్చిన వ్యోమగాముల్లో నాసాకు చెందిన టిమ్ కోప్రా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన టిమ్ పీకె, రష్యాకు చెందిన యూరి మలెన్‌చెంకో ఉన్నారు.

చిత్రం పారాచూట్ సాయంతో భూమికి దిగుతున్న సూఋజ్ వ్యోమనౌక.
ఒక వ్యోమగామిని వెలికి తీసుకొస్తున్న భద్రతా సిబ్బంది