అంతర్జాతీయం

టిల్లర్‌సన్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 13: సంచలనాలకు మారుపేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్‌కు ఉద్వాసన చెప్పేసి ఆయన స్థానంలో సీఐఏ డైరెక్టర్ మైక్ పొంపెయోను నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘టిల్లర్‌సన్ స్థానంలో మైక్ పొంపెయోను నియమించాం. ఇక నుంచి అమెరికా కొత్త విదేశాంగ మంత్రి పొంపెయో. పొంపెయో అద్భుతంగా పనిచేస్తారు’అని ట్రంప్ ప్రకటించారు. సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) డిప్యూటీ డైరెక్టర్ గినా హాస్పల్‌ను పొంపెయో స్థానంలో సీఐఏ కొత్త డైరెక్టర్‌గా నియమించారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విభాగం సీఐఏకు తొలిసారి ఓ మహిళను డైరెక్టర్‌గా నియమించి ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ క్లిష్ట సమయంలో మైక్ నియామకం తప్పనిసరి. అందుకే ఆయనను ఉన్నత పదవిలో నియమించాం. పైగా విదేశాంగ మంత్రి పదవికి మైక్ అత్యంత సమర్ధతగల నేత’అని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.‘ సైన్యంలోనూ పార్లమెంట్‌లోనూ ఎంతో అనుభవం ఉంది. సీఐఏను ముందుండి నడిపి వనె్నతెచ్చారు’ అని మైక్ పొంపెయోను ఉద్దేశించి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త సీఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్‌కు అభినందనలు తెలుపుతూ ట్రంప్ మరో ట్వీట్ చేశారు.