అంతర్జాతీయం

ప్రమాదవశాత్తు తుపాకి పేలి ముగ్గురు విద్యార్థులకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా, మార్చి 14: ఒక ఉపాధ్యాయుడి చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలిన సంఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడినట్టు కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. సీసైడ్ హైస్కూల్‌లో మంగళవారం, డెన్నిస్ అలగ్జాండర్ అనే ఉపాధ్యాయుడు, పిల్లలకు తుపాకీ భద్రతపై పాఠాన్ని బోధిస్తున్న సమయంలో, ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఉపాధ్యాయుడు, రిజర్వ్ పోలీసు అధికారిగా కూడా పనిచేస్తున్నారు. అయితే పాఠం చెబుతూ తుపాకిలో గుండ్లు లేవనుకొని, రూఫ్ వైపు పేల్చగా, గుండ్లు సీలింగ్‌కు తగిలి, ఊడిపడిన పెళ్లలు విద్యార్థులపై పడటంతో ముగ్గురు గాయపడ్డారు.