అంతర్జాతీయం

నవాజ్ ఇంటి సమీపంలో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసగృహం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించారు. వీరిలో ఆరుగురు పోలీసులు కూడా ఉన్నారు. షరీఫ్ కుటుంబం నివాసముంటున్న ఇంటికి కొద్ది కిలోమీటర్ల దూరంలో తబ్లీఘీ జమాత్ సెంటర్ సమీపంలో ఉన్న ఒక పోలీస్ చెక్‌పోస్ట్‌పై అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. తాలిబన్‌కు చెందిన ఒక టీనేజర్ ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసుల తెలిపారు. దాడి సమయంలో చెక్‌పోస్టులో ఉన్న 25 మంది పోలీసుల్లో 14 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఇనె్వస్ట్‌గేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) ప్రకారం, నలుగురు అనుమానిత ఉగ్రవాదులు తబ్లీఘీ జమాత్ వద్ద జనసమూహంలోకి చొచ్చుకొని పోవడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే వీరిలో ఒకడు తనను తాను పేల్చేసుకోగా మిగిలిన ముగ్గురు పారిపోయారు.
బాంబు పేలిన శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించింది. అయితే దాడికి తామే బాధ్యులమంటూ తెహ్రిక్-ఈ-తాలిబాన్ ప్రకటించిందని కొన్ని వార్తలు వెల్లడించాయి.

చిత్రం..పాక్‌లో బుధవారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో
మృతి చెందిన వారికి నివాళులర్పిస్తున దృశ్యం