అంతర్జాతీయం

హెచ్-4ను రద్దు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని పరిమితి వీసా విధానాన్ని రద్దు చేయవద్దని సిలికాన్ వ్యాలీలోని డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఆరుగురు శాసనకర్తలు ట్రంప్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. గత అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో రూపొందించిన ఈ నిబంధనను కొనసాగించాలని కోరినట్టు సిలికాన్ వ్యాలీ నుంచి వెలువడుతున్న మెర్క్యురీ న్యూస్ పేర్కోంది. శాశ్వత పౌరసత్వం కల్పించలేని పక్షంలో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు పని పర్మిట్ విసాలు అనుమతించకుంటే ఉద్యోగాలు చేయడం కష్టమంటూ దశాబ్దంపాటు ఆందోళనలు సాగిన నేపథ్యంలో, 2015లో ఓబామా సర్కారు హెచ్-4 వీసాలకు అవకాశం కల్పించింది. దీంతో భారతీయ ఎన్నారైలు ఎక్కువ లబ్దిపొందుతున్నారు. డిహెచ్‌ఎస్ సర్వీసెస్ మరియు ఇమ్మిగ్రేషన్ సేవల కింద సుమారు లక్షమంది హెచ్1బి వీసాధారుల జీవిత భాగస్వాములు ఈ నిబంధన కింద లబ్దిపొందుతున్నట్టు అంచనా. డెమొక్రటిక్ పార్టీకి చెందిన శాసనకర్తలు అన్నా ఇషో, జోయ్ లెఫ్‌గ్రెన్, రో ఖన్నా, మార్క్ డిసాల్నైర్, బార్బారా లీ, జెర్రీ మెక్‌నెర్నీలు హోంల్యాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ సెక్రటరీకి ఓ లేఖ రాసినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. హెచ్1బి వీసాధారుల జీవిత భాగస్వాములకు పని పర్మిట్ వీసాలు రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్న తరుణంలో, ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచన చేయాలని లేఖలో కోరినట్టు తెలుస్తోంది. పని పర్మిట్ వీసాలను రద్దు చేయడం వల్ల ఆర్థిక అస్థిరత్వం తలెత్తే ప్రమాదం ఉందని, ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో ప్రతిభావంతులైన హెచ్1బి వీసాదారులు చాలామంది వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదని ఈ లేఖలో విస్పష్టంగా పేర్కొన్నట్టు మెర్క్యురీ న్యూస్ తన కథనంలో పేర్కొంది.