అంతర్జాతీయం

ఆయుధ సరఫరాలో అమెరికా సెకండ్ గేర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి: భారత్‌కు ఆయుధాలు అమ్ముతున్న దేశాల జాబితాలో అమెరికా ద్వితీయ స్థానానికి చేరుకుంది. భారత్ తన రక్షణావసరాల కోసం అనేక దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నా, గత ఐదేళ్లలో అమెరికా నుంచి భారత్‌కు సరఫరా అయిన ఆయుధాలు పరిమితి 15శాతానికి చేరుకుందని స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి అధ్యయన కేంద్రం (సిప్రి) అధికారిక నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్ల కాలంలో ఆయుధాల అమ్మకాలను వాషింగ్టన్ ఐదు రెట్లు పెంచినట్టు ఈవారం తన నివేదికలో సిప్రి పొందుపర్చింది. భారత్‌కు ఆయుధ సరఫరాదారుల్లో ఇజ్రాయిల్ తృతీయ స్థానానికి చేరుకుందని, 2013-17 మధ్యకాలంలో 11 శాతంమేర ఆయుధాలు ఇక్కడి నుంచే సరఫరా అయినట్టు కూడా సిప్రి పేర్కొంది. భారత ఆయుధ సరఫరాదారుల్లో అగ్రస్థానంలో ఉన్న రష్యా, ఇటీవలి కాలంలో కొంచెం వెనుకపడిందని సిప్రి నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆయుధ వాణిజ్య రిపోర్టుల ప్రకారం ప్రస్తుతం భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధాల్లో 62 శాతం షేర్ రష్యాదే. అయితే 2008-12 మధ్యకాలంలో ఈ షేర్ 79 శాతం ఉండేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. పెద్దఎత్తున ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ప్రపంచం మొత్తంమీద భారత్ 12శాతంతో అగ్రస్థానంలో ఉంది. అయితే, గత ఐదేళ్లకాలంలో వివిధ దేశాల నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధాల శాతం 24కు చేరిందని సిప్రి తన నివేదికలో వెల్లడించింది. ‘పొరుగు దేశాలైన పాక్, చైనాల నుంచి తలెత్తుతోన్న సరిహద్దు వివాదాల కారణంగా కీలక ఆయుధ సంపత్తిపై భారత్ దృష్టి పెట్టాల్సి వస్తోంది. సొంతంగా ఉత్పత్తి చేసుకునే అవకాశాలు తక్కువ ఉండటంతో దిగుమతి చేసుకోక తప్పడం లేదు’ అని సిప్రి సీనియర్ అధ్యయనవేత్త సీమన్ వెజెమన్ పేర్కొన్నారు. ‘చైనాలో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సొంతంగా ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, ఆయుధ సరఫరా విషయంలో పాక్, బంగ్లాదేశ్, మయన్మార్‌తో సంబంధాలు నెరపుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ రెంటికీ భిన్నమైన పరిస్తితి పాక్‌లో కనిపిస్తోందని సీమన్ తన నివేదికలో వెల్లడించారు. గత ఐదేళ్లలో ఆయుధ దిగుమతిని పూర్తిగా తగ్గించిందని, ఇందుకు కారణం నాటకీయ ఫక్కీలో అమెరికా నుంచి భారీగా ఆయుధాలు అందుతుండటమేనని పేర్కొన్నారు. ‘్భరత్‌తో పాక్‌కు టెన్షన్స్ ఉండటం, దేశంలో అంతర్గత అనిశ్చితి నెలకొంటున్న తరుణంలోనూ పాకిస్తాన్ 2008-12, 2013-17 కాలంలో ఆయుధ దిగుమతులను 36 శాతం తగ్గించుకున్నట్టు సిప్రి తన నివేదికలో వెల్లడించింది.