అంతర్జాతీయం

అంగుళం కూడా వదులుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్ : తమ భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఇతరులకు వదులుకోబోమని, అవసరమైతే భీకర యుద్ధం చేయడానికి వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఇక్కడ జరుగుతున్న నేషనలిస్టిక్ కమ్యూనిస్టు పార్టీ ముగింపు సమావేశంలో మంగళవారం 30 నిముషాల సేపు ప్రసంగిస్తూ, ‘‘ఆధునిక కాలం ప్రారంభం నుంచి గ్రేట్ చైనా పునరుద్ధరణ దేశ ప్రజల ప్రధాన కలగా మారింది’’ అన్నారు. ఈవిధంగా ముగింపు సమావేశంలో దేశాధ్యక్షుడు ప్రసంగించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. మావో జిడాంగ్ తర్వాత అంతటి స్థాయిలో శక్తివంతమైన నేతగా ఎదిగింది జిన్‌పింగ్ మాత్రమే. చైనాకు వివిధ దేశాలతో సరిహద్దు వివాదాలున్నాయి. భారత్‌తో పాటు, తూర్పు చైనా సముద్రంలోని జపాన్ ఆధీనంలో ఉన్న శంకాకు దీవులు కూడా తనవేనని చైనా వాదిస్తోంది. ఇదే సమయంలో సువిశాల దక్షిణ చైనా సముద్రంపై పూర్తి హక్కులు తనవేనంటోంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, తైవాన్‌లు దక్షిణ చైనా సముద్రంపై తమకు కూడా హక్కులున్నాయని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రపంచంలో సముచిత స్థానం సాధించే సత్తా చైనాకు ఉన్నదని జిన్‌పింగ్ ఈ సందర్భంగా నొక్కి చెప్పడం గమనార్హం. సాధారణంగా ఏటా చైనా పార్లమెంట్ వార్షిక సమావేశాలు ముగిసిన తర్వాత దేశాధ్యక్షుడు విలేకర్ల సమావేశంలో మాట్లాడటం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా జిన్‌పింగ్ (64) మొట్టమొదటి సారి ముగింపుసమావేశంలో ప్రసంగించడం విశేషం.
‘‘చైనా ప్రజలు అసాధ్యులు. మా శత్రువులతో ఎంతటి స్థాయి యుద్ధాన్ని జరపడానికైనా వెనుకాడబోరు. మాకు చెందిన భూభాగాలను తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి కృతనిశ్చయులమై ఉన్నాం’’ అని జిన్‌పింగ్ జాతీయ టెలివిజన్‌లో చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇటువంటి గొప్ప కలను నిజం చేసుకోవడానికి 170 సంవత్సరాలుగా పోరాటం సలిపాం. చైనీయుల కల సాకారం కావడానికి ఎంతోకాలం పట్టదు’’ అన్నారు.‘‘ దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత కాపాడుకోవడం చైనీయుల ఆకాంక్ష. మాతృభూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం’’, అన్నారు. తైవాన్‌ను దృష్టిలో పెట్టుకునే జిన్‌పింగ్ ఈ వ్యాఖ్య చేసినట్లు అర్థమవుతోంది. తైవాన్‌తో పాటు బహిష్కృత బౌద్ధ నేత, దలైలామా ‘విభజన వాది’గా అభివర్ణించారు. కాగా ముస్లిం మెజారిటీ ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లో ‘తుర్కిష్ ఇస్లామిక్ ఉద్యమాన్ని’ చైనా అత్యంత కఠినంగా అణచివేస్తోంది. చైనాను విభజించాలనుకునేవారు కఠిన శిక్షకు పాత్రులవుతారని జిన్‌పింగ్ హెచ్చరించారు. ‘వన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ (బిఆర్‌ఐ)’ గురించి ఆయన మాట్లాడుతూ, చైనా అభివృద్ధి మరే ఇతర దేశానికి ప్రమాదం కాదన్నారు. ‘‘చైనా విస్తరణ వాదాన్ని అనుసరించడంలేదు. ప్రమాదం అన్న మాటకు అంటిపెట్టుకున్నవారే ప్రమాదం ఉన్నదని భావిస్తున్నారు’’ అన్నారు. కాగా చైనా-పాకిస్తాన్ ఆర్థిక నడవాకు భారత్ అభ్యంతరం చెబుతున్న సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.