అంతర్జాతీయం

ఆయుధ అక్రమ రవాణాను ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ నేషన్స్, మార్చి 21: ఆయుధాల అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా పెంచడంతోపాటు సంబంధిత యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని ఐక్యరాజ్య సమితిని భారత్ కోరింది. చిన్న, తేలికపాటి ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరిహద్దులు దాటి అక్రమంగా రవాణా అవుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్టవేయడానికి ఐరాస చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విదేశాంగ శాఖ అండర్ సెక్రెటరీ నిధి తివారీ ఆయుధాల అక్రమ రవాణా అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు. ప్రొగ్రాం ఆఫ్ యాక్షన్ టు ప్రివెంట్(పీఓఏ)ను పటిష్టంగా అమలుచేయడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఐరాసలో జరిగిన పీఏఓ సన్నాహక కమిటీ సమావేశంలో భారత జాతీయ భద్రత అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ఉగ్రవాదం, స్మగ్లింగ్, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పైరసీ ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు. ఇందులో చిన్న, తేలికపాటి ఆయుధాల అక్రమ రవాణా అత్యంత హానికరమని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటి పట్ల తాము అత్యంత కఠినంగానే వ్యవహిస్తున్నామని వెల్లడించారు. అయినప్పటికీ పొరుగు దేశాల నుంచి సరిహద్దులు దాటి ఆయుధాలు అక్రమ రవాణా అవుతున్నాయని చెప్పారు. ‘పీఏఓను మరింత పటిష్టంగా అమలుచేయడం ద్వారా ఆయుధ రవాణా, స్మగ్లింగ్ వంటి అసాంఘిక చర్యలను అడ్డుకోగలం’ అని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వందల కిలోమీటర్ల సరిహద్దులో భద్రతా సిబ్బంది పెను సవాల్‌నే ఎదుర్కొంటున్నారని నిధి తెలిపారు.