అంతర్జాతీయం

మార్మోగిన స్లోగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 25: అమెరికా మహా నగరాలన్నీ జన ఉప్పెనను తలపించాయి. దశాబ్దాల తరబడి రాకాసిపుండుగా మారిన తుపాకీ సంస్కృతి చరమగీతం పా డాలన్న రణన్నినాదం అగ్రరాజ్యం నలుమూలలా మా ర్మోగింది. అట్లాంటా, బోస్టన్, షికాగో, ఢల్లాస్, డెనె్వర్, లాస్‌ఏంజిల్స్, మియామి, మినియాపొలిస్ వంటి నగరాల నుంచి వందలు వేలుకాదు లక్షల్లో గన్‌కల్చర్‌ను వ్యతిరేకిస్తూ రోడ్లెక్కారు. దాదాపు పది లక్షలమంది పాల్గొన్న ఈ తుపాకీ సంస్కృతికి వ్యతిరేక ఉద్యమానికి విద్యార్థులే నేతలయ్యారు. వారి సారథ్యంలోనే జనం కదిలారు. ‘ఉంటారా.. పోతారా?’ అంటూ రాజకీయ నాయకత్వానికి పెను సవాలే విసిరారు. ‘రాజకీయ నా యకులారా.. మీరు ప్రజల అభిమతానికి ప్రాతినిథ్యం వహించండి. లేదా అధికారం నుంచి తప్పుకోండి’ అంటూ ఫ్లోరిడాలోని డౌగ్లాస్ హైస్కూల్‌కు చెందిన పదిహేడేళ్ల విద్యార్థి స్టోన్‌మాన్ హెచ్చరిక స్వరాన్ని వినిపించాడు. ‘మాతోనే ఉండండి. కొత్త ఓటర్లు వస్తున్నారు జా గ్రత్త’ అంటూ తమ ఆకాంక్ష, అభిమతాన్ని మరో విద్యా ర్థి నాయకుడు కాస్కీ దిక్కులు పిక్కటిల్లేలా చాటి చెప్పా డు. ఫిబ్రవరిలో ఫ్లోరిడా హైస్కూల్లో 17మంది విద్యార్థులను బలిగొన్న ఉదంతంతో యావత్ అమెరికా కళ్లు తె రిచిందని చెప్పడానికి అమెరికా చరిత్రలోనే చారిత్రాత్మకంగా చెబుతున్న ఈ మహా ప్రదర్శనలే నిదర్శనం. తు పాకులను ఆత్మరక్షణగా, అవి లేకపోతే తమకు భద్రతే లేదన్న భావనతోనే ఈ సంస్కృతికి పట్టగడుతూ వచ్చి న అమెరికన్లు, ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా కదంతొక్కుతున్నారు. న్యూయార్క్‌లో జరిగిన ర్యాలీలో దాదా పు 2 లక్షల మంది పాల్గూన్నారు. ‘ఈ విద్యార్థులు అమెరికా ఆలోచనల్లో మార్పు తేవడం ఖాయం’ అంటూ అనేకమంది ఉద్యమ తీవ్రతపై వ్యాఖ్యానించారు. అ త్యంత భారీ సంఖ్యలో వాషింగ్టన్‌లో ఈ ర్యాలీ జరిగిం ది. దాదాపు 8లక్షల మంది ఇందులో పాల్గొన్నట్టుగా అంచనా. 2000 సంవత్సరంలో జరిగిన మిలియన్ మా మ్ మార్చ్ తరువాత తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా ఇంత భారీ ర్యాలీ నిర్వహించటం ఇదే మొదటిసారి అ ని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా సాగిన ఈ ర్యాలీలకు ప్రధాన వేదికగా వాషింగ్టన్ మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ తుపాకీ లైసెన్స్ మంజూరీకి సంబంధించి కఠిన చట్టాలు తేవాలని, వీటి విచ్చలవిడి విక్రయాలకు తక్షణమే స్వస్తి చెప్పాలని ముక్తకంఠంతో తెలిపారు. దాడి చేయడానికి ఉపయోగించే ఆయుధ విక్రయాన్ని నిషేధించాలని విద్యార్థి నాయకుడు కాస్కీ అన్నారు. అలాగే తూటాల విక్రయాన్ని నిలిపివేయాలని, ఒకవేళ తుపాకులను విక్రయిస్తే వాటిని కొనేందుకు వచ్చిన వ్యక్తి నేపథ్యాన్ని, మానసిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశాడు. చినుకు చినుకుగా మొదలైన ఈ తుపాకీ సంస్కృతి వ్యతిరేక ఉద్యమాన్ని రానున్న రోజుల్లో ఓ మహా ప్రవాహంగా మార్చేందుకు తుపాకీ సంస్కృతిని పెంచిపోషించే నేతలను దారికి తెచ్చే మహాయుధంగా రూపొందించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాగే అత్యంత శక్తివంతమైన గన్ లాబీపైన కూడా ఈ సందర్భంగా నిరసన కారులు నిప్పులు చెరిగారని నిర్వాహకులు తెలిపారు. ‘వీరు పిల్లలు కాదు, పిడుగలే. వారి వా దనలో అర్థమూవుంది, బలమూ ఉంది’ అంటూ జెఫ్ టర్చిన్ అనే 68ఏళ్ల వృద్ధుడు స్పష్టం చేశారు.
వాషింగ్టన్ ర్యాలీలో పాల్గొనేందుకు తాను న్యూయార్క్ నుంచి వచ్చానని తెలిపాడు. ఇప్పటివరకు స్కూళ్లలోనూ, మా ల్స్‌లోనూ జరిగిన దాడుల్లో మరణించిన పిల్లల తల్లిదండ్రులు కూడా దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తుపాకుల విచ్చలవిడి విక్రయాన్ని నియంత్రించాలని గట్టిగా వాదించారు.