అంతర్జాతీయం

ప్రదర్శనకు భగత్‌సింగ్ కేసు వివరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ కేసులు విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను మొట్టమొదటిసారి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రదర్శించనున్నది. సోమవారం వీటిని, లాహోర్‌లోని అనార్కలీ సమాధి వద్ద ఉన్న పంజాబ్ ఆర్ఖీవ్స్ డిపార్ట్‌మెంట్‌లో సోమవారం ప్రదర్శనగా ఉంచుతారు. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్ స రుూద్ నేతృత్వలో జరిగిన ప్రభుత్వ అత్యున్నత స్థాయి ఉద్యోగుల సమావేశంలో ఈ మేరకు నిర్ణ యం తీసుకున్నారు. ‘్భగత్ సింగ్ భారత్, పాకిస్తాన్‌లకు హీరో అయినందువల్ల, బ్రిటిష్ రాజ్‌కు వ్య తిరేకంగా ఆయన నిర్వహించిన పోరాటం రెండు దేశాల ప్రజలకు తెలియాల్సి ఉంది’ అని అధికార్లు పేర్కొన్నారు.
జైలు నుంచి భగత్‌సింగ్ తన తండ్రికి రాసిన లేఖలు, తానొక రాజకీయ ఖైదీనని పేర్కొంటూ ‘ఏ’ క్లాసు సదుపాయాలు కల్పించాలని కోరిన లేఖ లు, పుస్తకాలు, దినపత్రికలు, అజ్ఞాతంలో కొనసాగినప్పుడు వారున్న హోటళ్ల వివరాలను కూడా ప్రదర్శనలో ఉంచుతారు. తనకు జైల్లో సదుపాయాల కల్పనను కోరుతూ రాసిన లేఖల్లో ఆయన సంతకాలున్నాయి. స్వాతంత్య్రోద్యమంలో విప్లవపంథా అనుసరించిన ఈ దేశభక్తుడు, తాను రాసి న దరఖాస్తుల కింద ‘యువర్స్ ట్రూలీ లేదా యు వర్స్ ఒబిడియంట్లీ’ వంటి పదాలను ప్రయోగించలేదు. అందుకు బదులుగా ‘యువర్స్ ఈటీసీ.. ఈటీసీ’ అని పేర్కొన్నారని పంజాబ్ అధికారులు వెల్లడించారు.
ఆయనపై కేసు ఫైలింగ్, భగత్‌సింగ్, రాజ్‌గు రు, సుఖదేవ్‌లను దోషులుగా కోర్టు ప్రకటించడం, బ్లాక్ వారంట్లు, వీరిని ఉరి తీసినట్లు జైలర్ పంపిన నివేదిక వివరాలను కూడా ప్రదర్శనలో ఉంచుతారు. రవి రోడ్డులోని ఒక కర్మాగారం, గోవల్మండి, మోజాంగ్, మెక్‌లియోడ్ రోడ్డులోని కశ్మీర్ బిల్డింగ్ ప్రాంతాల్లో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు నివసించారు. వీటి చిత్రాలతోపాటు, డిఎవి కళాశాలలో వీరు ప్రవేశం పొందిన రిజిస్టర్, పుస్తకాలు, నవలలు, విప్లవ సాహిత్యం ప్రదర్శనలో ఉంచుతా రు. ‘పంజాబ్ ట్రాజిడీ’, ‘జక్మీ పంజాబ్’, ‘గంగాదాస్ డాకూ’, ‘సుల్తానా డాకూ’, ‘ది ఎవల్యూషన్ ఆఫ్ సిన్ ఫెన్’, ‘ ది హిస్టరీ ఆఫ్ ది సిన్ ఫెన్ మూవ్‌మెంట్’ పుస్తకాలు కూడా ప్రదర్శిస్తారు.
నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఫైల్ చేసిన కేసులో, దేశ వ్యాప్తంగా భగత్ సింగ్, ఆయన 25 మంది అనుచరుల గురించిన సమాచారం, వీరి హిందుస్తాన్ సోషలిస్ట్ రివల్యూషనరీ ఆర్మీ, నవజవాన్ భారత్ సభలకు సంబంధించిన వివరాలు ఉన్నా యి. 1931, మార్చి 23న భగత్ సింగ్‌ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. బ్రిటిష్ పోలీసు అధికార జాన్ పి. సాండర్స్ హత్య కేసులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లపై నాటి పోలీసులు కేసు నమోదు చేశారు. సాండర్స్, కానిస్టేబుల్ చరణ్‌సింగ్ మృతదేహాల పోస్ట్‌మార్టం రిపోర్టు వివరాలు కూడా ఈ ఆర్ఖీవ్స్ ప్రదర్శనలో ఉంచుతారు.