అంతర్జాతీయం

పాక్ ప్రధానికి అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాక్ ప్రధాని షాహిద్ ఖాఖన్ అబ్బాసీ అమెరికా పర్యటన సందర్భంగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయంలో తనిఖీల పేరుతో భద్రతాధికారులు ప్రధానిని ఇబ్బంది పెట్టారన్న మీడియా కథనాలు కలకలం రేపుతున్నాయి. అసలే ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీల వ్యవహారం మరింత ఇబ్బందిగా పరిణమించింది. ప్రధాని అబ్బాసీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో ఉంటున్న సోదరిని చూడడానికి ప్రధాని అక్కడకు వెళ్లారు. ఇది పూర్తిగా ప్రైవేటు పర్యటనేనని జియో చానల్ వెల్లడించింది. అయినప్పటికీ ఓ దేశ ప్రధాని అన్నది చూడకుండా సాధారణ ప్రయాణికుని వల్లే ఆయనను క్యూలో నిలబెట్టారని చానల్ కథనం. కనీస ప్రొటోకాల్ పాటించలేదని మీడియా తప్పుపట్టింది. సెక్యూరిటీ చెకప్ అయిన తరువాత తన బ్యాగ్, కోట్ తీసుకుని అబ్బాసీ నడుచుకుంటూ బయటకు వస్తున్నప్పటి వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ఒక ప్రధాన మంత్రినే కాదు దేశానే్న అవమానించే చర్యగా పాక్ మీడియా అభివర్ణించింది. ఆ పర్యటన సందర్భంగానే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో ప్రధాని భేటీ అయినట్టు చెబుతున్నారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతు తెలుపుతుందని మైక్ తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే అబ్బాసీ ఆయనను కలుసుకుని ఉంటారని పేర్కొన్నారు.