అంతర్జాతీయం

మద్దతు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాష్కంట్, జూన్ 23: అణు ఇంధన సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జి) సభ్యత్వంకోసం గట్టి ప్రయత్నం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వానికి చైనా మద్దతును మోదీ కోరినట్లు సమాచారం. భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో మోదీ-జిన్‌పింగ్‌ల సమావేశం అత్యంత కీలకమైందని భావిస్తున్నారు.
సియోల్‌లో ప్రారంభమైన రెండు రోజుల అటామిక్ ట్రేడింగ్ క్లబ్ ప్లీనరీని ఈ ఇద్దరు నేతల చర్చలు ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. 48దేశాల సభ్యత్వం కలిగిన ఎన్‌ఎస్‌జిలో చైనా, టర్కీ, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు భారత సభ్యత్వానికి అభ్యంతరం చెప్తున్నాయి. అయితే చైనా మద్దతు కనుక లభిస్తే ఈ దేశాలు కూడా సానుకూలంగా మారుతాయని భారత్ భావిస్తోంది. షాంఘాయ్ కో ఆపరేషన్ ఆర్గనేజేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ, జిన్‌పింగ్ సహా పలు దేశాధినేతలు తాష్కెంట్ వచ్చారు. అంతకుముందు పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఎన్‌ఎస్‌జిలో పాక్ సభ్యత్వానికి మద్దతునిచ్చినందుకు ఆయన జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు మద్దతునిచ్చే విషయంలో ఎన్‌ఎస్‌జి సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చైనా పేర్కొంది. సియోల్ ప్లీనరీలో భారత్ సభ్యత్వం అజెండాలో లేదని చైనా మరోసారి ఉద్ఘాటించింది. అంతేకాకుండా భారత్‌తోపాటు పాకిస్తాన్ అభ్యర్థిత్వాన్ని కలిపి చైనా మాట్లాడుతోంది. అణు నిరాయుధీకరణ విషయంలో రెండు దేశాల ట్రాక్ రికార్డు చూసి నిర్ణయం తీసుకోవలసి ఉందని పేర్కొంటోంది. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం ఇవ్వాలంటూ ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు ఇచ్చాయి. దాదాపు 20 దేశాలు భారత్‌కు సభ్యత్వాన్ని సమర్థిస్తున్నాయి. అయితే ఎన్‌ఎస్‌జిలో ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయంతోనే తీసుకుంటారు. అందువల్ల మిగతా దేశాల మద్దతునూ భారత్ కూడగట్టాల్సి ఉంది. చైనా సమర్థిస్తే చాలా వరకు దేశాలు అదే బాటలో నడవవచ్చని భావిస్తోంది.

చిత్రం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో గురువారం తాష్కంట్‌లో సమావేశమైన ప్రధాని మోదీ