అంతర్జాతీయం

పుడమి నెత్తిన మరో స్పేస్‌స్టేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఏప్రిల్ 1: నాటి స్కైలాబ్‌ను తలపించే రీతిలో నేడు మరో స్పేస్ స్టేషన్ భూమి మీద కుప్పకూలబోతోంది. చైనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రోదసి స్పేస్ స్టేషన్ తియాంగాంగ్-1 సోమవారం భూ వాతావరణంలోకి ప్రవేశించబోతోంది. దీని శకలాలు ఆస్ట్రేలియా నుంచి అమెరికా మధ్య ఎక్కడైనా భూమి మీద పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ శకలాల వల్ల భూమికి ఏ రకమైన నష్టం వాటిల్లే అవకాశం లేదని నిపుణుల ధీమా. భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే ఈ స్పేస్ స్టేషన్ దగ్ధమైపోతుందని చెబుతున్న శాస్తవ్రేత్తలు నాటి 80 టన్నుల స్కైలాబ్, 140 టన్నుల మిర్ స్పేస్ స్టేషన్లు కుప్పకూలిన ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. చైనా స్పేస్ స్టేషన్ శకలాలు భూమి మీద పడటం వల్ల పౌరయాన సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అలాగే పుడమికి ఎలాంటి నష్టం వాటిల్లబోదని చైనా అధికార జిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఇప్పటికీ ఈ స్పేస్ స్టేషన్ భూ వాతావరణంలోకి దూసుకొస్తోందని, ఒక్కసారి ఈ వాతావరణంలోకి ఇది ప్రవేశించిన వెంటనే అధిక ఉష్ణోగ్రత పీడనం వల్ల దాని ప్రధాన నిర్మాణం పేలిపోతుందని వెల్లడించింది. 80 కి.మీ ఎత్తులోనే ఈ స్పేస్ స్టేషన్ తునాతునకలైపోతుందని, ఆ ముక్కలు మండుతున్న దశలోనే భూమి దిశగా పడే అవకాశం ఉంటుందని చాలామటుకు అది గాలిలోనే ఆవిరైపోయే అవకాశమూ ఉందని ఈ వార్తాసంస్థ తెలిపింది. ఈ స్పేస్ స్టేషన్ శకలాలు స్వల్ప పరిమాణంలోనే భూమిమీద పడే అవకాశం ఉందని, వాటి ద్రవ్యరాశి తక్కువగా ఉండటం వల్ల వాటి వేగమూ తగ్గుతుందని తెలిపింది. చైనా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.25 నిమిషాలకు ఈ స్పేస్ స్టేషన్ భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐరోపా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. దీనివల్ల భూమికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేకపోయినా ముందుజాగ్రత్త చర్యగా అత్యవసర బృందాలను ఏర్పాటుచేశారు. రెండు సంవత్సరాల కాలవ్యవధితో 2011లో ఈ స్పేస్ స్టేషన్‌ను చైనా ప్రయోగించింది. 2013 నాటికే దీని కాలపరిమితీ తీరిపోయింది.