అంతర్జాతీయం

హఫీజ్ సరుూద్‌కు మరోదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ముంబయి దాడులకు బాధ్యుడైన హఫీస్ సరుూద్ నేతృత్వంలోని మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పార్టీని ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించింది. ఈ ప్రకటనతో పాకిస్తాన్‌లో కీలక రాజకీయ నేతగా ఎదగాలన్న హఫీజ్ సరుూద్ ఆశలపై నీరు చల్లినట్లయింది. ఇదే సమయంలో ఎంఎంఎల్‌కు చెందిన ఏడుగురు కేంద్ర నాయకులను కూడా విదేశీ ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీటికి తోడు తెహ్రీక్-ఎ-ఆజాదీ-కశ్మీర్ (టీఏజెకె)ను కూడా ఉగ్రవాద గ్రూపులో చేర్చింది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయిన టీఏజెకె ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా సంచరిస్తున్నారని పేర్కొంది. ఆంతరంగిక భద్రతా శాఖ నుంచి క్లియరెన్స్ సర్ట్ఫికెట్‌ను సమర్పించాలని పాక్ ఎన్నికల సంఘం ఎంఎంఎల్‌ను కోరిన ఒకరోజు తర్వాత యుఎస్ ఈవిధంగా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే జూలైనెలలో పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో ఆంతరంగిక భద్రతాశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాక్ ఎన్నికల సంఘం ఎంఎంఎల్‌ను రాజకీయ పార్టీగా గుర్తించడానికి నిరాకరించింది. లష్కరేతోయిబా మరిన్ని ఉగ్రవాద దాడులకు పాల్పడకుండా నిరోధించడానికే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా ఆంతరంగిక శాఖ ప్రకటించింది. ‘లష్కరే తోయబా తనపై విధించిన ఆంక్షలను రద్దు చేసుకోవడానికి రాజకీయ పార్టీగా అవతరించడం ద్వారా ప్రజలను మోసగించే చర్యలు అడ్డుకునే చర్యల్లో ఇది భాగం’ అని స్పష్టం చేసింది.