అంతర్జాతీయం

యూజర్ల సమాచారం భద్రతపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 5: యూజర్ల సమాచార భద్రతపై తమ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందుకోసం కృత్రిమ మేధోపకరణాలను ఉపయోగిస్తూ వే లాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఫేస్‌బుక్ సీఈఓ జూకర్‌బర్గ్ వెల్లడించాడు. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, 2018 ‘ఎన్నికల సంవత్సరం’గా పేర్కొన్నాడు. ఈ ఏడాది చాలా దేశాల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ఫేస్‌బుక్ తన యూజర్ల రక్షణకు సెక్యూరిటీ ఫీచర్లను మరింతగా విస్తరిస్తోందన్నాడు. ప్రస్తుతం 15వేల మంది ఉద్యోగులు భద్రత, సమాచార సమీక్షపై పనిచేస్తున్నారని, ఈ ఏడాది చివరినాటికి వీరి సంఖ్యను 20వేలకు పైగా పెంచుతామన్నారు. అమెరికాలో మిడ్‌టర్మ్‌లు, భారత్, బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్, హంగరీ వంటి దేశాల్లో ఎన్నికలు జరుగనుండటం వల్ల యూజర్ల సమాచార భద్రతపై ప్రధానం గా దృష్టి కేంద్రీకరించామన్నారు. భారత్‌లోని కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనుండగా, సాధారణ ఎన్నికలకు మరో ఏడాది సమయముంది.
‘మేం ప్రధానంగా మూడు రకాల కారకుల కార్యకలాపాలను అరికట్టడానికి విభిన్న వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. మొదటి రకం ఆర్థికపరమైన కారకులు. వీరు ప్రధానంగా స్పామర్లుగా ఉంటారు. రెండో రకం ఎన్నికల్లో కల్పించుకోవడానికి ప్రయత్నించే ప్రభుత్వాలు. ఇక మూడో కారకులు కేవలం ఒకే పక్షంకోసం యత్నించేవారు. వీరిలో నిజాయతీ ఎంతమాత్రం ఉండదు’ అన్నారు.
నాకో అవకాశం ఇవ్వండి
యూజర్ల సమాచారం దుర్వినియోగంపై జుకర్‌బర్గ్ మరోసారి క్షమాపణలు చెప్పాడు. ‘చాలా పెద్ద పొరపాటు జరిగింది’ అంటూ ‘నాకు మరోఛాన్స్’ ఇ వ్వండి అంటూ మీడియా సమావేశంలో కోరాడు. బ్రిటన్‌కు చెందిన రాజకీయ విశే్లషణ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని అక్రమంగా వాడుకున్నదన్న ఆరోపణలపై దుమారం రేగి న అంశం తెలిసిందే. గతంలో 50 మిలియన్ యూ జర్ల సమాచారం దుర్వినియోగమైందని అంచనా వేసినా, అది 87 మిలియన్లుగా తేలింది. వీరిలో అత్యధికులు అమెరికాకు చెందినవారే. కేంబ్రిడ్జి అనెలిటికా 2016 అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరపున పనిచేసిన సంగతి తెలిసిందే. ఇంత జరిగినా సంస్థను నడపడానికి మీరే సరైన వ్యక్తి అని భావిస్తున్నారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘ఈవిధంగా సమాచారం దుర్వినియోగం కా వడం, యూజర్లు, ప్రజాప్రతినిధులు, ప్రకటనకర్తలకు తీవ్ర ఆగ్రహం కలిగించి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ సంస్థను నడిపే సరైన వ్యక్తిని నేనే. ఇది పెద్దపొరపాటే. కాదనలేం. కానీ అందుకు నేనే బాధ్యుడిని. దీనిపై నేను ఎవరిపై నిందలు మోపను. తప్పులు జరగడం సహజం. ఈ తప్పులనుంచే పాఠాలు నే ర్చుకొని ముందుకు సాగుతాం. అందువల్ల నాకో అవకాశం ఇవ్వండి’ అన్నాడు. కాగా సమాచార దు ర్వినియోగంపై జుకర్‌బర్గ్‌ను, కాంగ్రెస్ కమిటీ వచ్చేవారం ప్రశ్నించనుంది.