అంతర్జాతీయం

శాంతిని దెబ్బతీస్తున్న ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బకు, ఏప్రిల్ 5: ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఉగ్రవాదం ‘మా పౌరుల ను’ చంపుతోంది, అభివృద్ధి లక్ష్యాలను అడ్డుకుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలీనోద్య మ (ఎన్‌ఏఎం) 18వ మధ్యంతర మంత్రుల స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టకుండా, మరే ఇత ర సంస్కరణలు చేపట్టినా ప్రయోజనం ఉండబోదన్నారు. శక్తివంతమైన భద్రతామండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని ఎంతోకాలంగా భారత్ నొక్కిచెబుతోందన్నారు. గత ఐక్యరాజ్య సమితి ఉన్నతస్థాయి సమావేశంలో ప్రపంచ దేశా లు, యుఎన్‌లో సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెప్పాయి. అత్యంత కీలకమైన ఈ అంశంపై వివిధ ప్రభుత్వాల మధ్య సమగ్ర చర్చలు జరగాల్సి ఉం ది. తర్వాత విశ్వసనీయమైన ఉమ్మడి కార్యక్రమంతో కలసికట్టుగా ముందుకు సాగాలని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. దీనిపై తర్వాతి దశ చర్చలు జరగాల్సిన తరుణం ఆసన్నమైందని అలీన దేశాలతో సహా ఐరాసలోని మెజారిటీ దేశాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు.
ఉగ్రవాదంపై ఆమె మాట్లాడుతూ, ‘ఉగ్రవాదం పై జరుగుతున్న చర్చలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి సంబంధం ఉండడంలేదు’ అన్నారు. ద్వంద్వ వైఖరులను విడనాడి, ప్రస్తుతం అమల్లో ఉన్న అంతర్జాతీయ చట్టాలను మరింత బలోపేతం చేయాలని, అప్పుడు మాత్రమే అనుకున్న ఫలితా లు వస్తాయన్నారు. కాంప్రహెన్సివ్ కనె్వన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం (సీసీఐటీ) ఏర్పాటు ద్వా రా ప్రస్తుత అంతర్జాతీయ చట్టాలను మరింత బలోపేతం చేయాలని 1996లో భారత్ ప్రతిపాదించింది. కానీ రెండు దశాబ్దాలు గడుస్తున్నా అడుగు ముందుకు పడలేదని ఆమె గుర్తు చేశారు. ప్రపంచంలో ఉగ్రవాదులు యథేచ్ఛగా పేట్రేగిపోవడం కొనసాగుతూనే ఉన్నదన్నారు. అందువల్ల మొట్టమొదట మనం చేయాల్సింది సీసీఐటీకి తుదిరూ పం ఇవ్వడంలో మన నిబద్ధతను సమీక్షించుకోవా లి. ఈ దిశగా ప్రపంచదేశాలు చర్యలు తీసుకునే విధంగా అలీన దేశాలు కృషి చేయాలన్నారు.
‘పాలస్తీనా ప్రజలకు భారత్ మద్దతునిస్తోది. ఇది భారత విదేశాంగ విధానంలోని ప్రధానాంశం. ఈ నేపథ్యంలో అలీన దేశాలు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది’ అని సుష్మా స్వరాజ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యున్‌ఆర్‌డబ్ల్యుఏ) ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ సం స్థకు భారత్ తన వాటా మొత్తాన్ని మిలియన్ అమెరికన్ డాలర్లనుంచి, ఐదుమిలియన్ డాలర్లకు పెం చిందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అణుప్రమాదం, సైనిక సంఘర్షణలు, శరణార్థుల వలసలు, ఉగ్రవాదం, పేదరికం, పెరిగిపోతు న్న వాతావరణ కాలుష్యం వంటి సవాళ్లను సమర్థవంతమైన బహుపాక్షిక విధానాలను అనుసరించడం ద్వారా అరికట్టవచ్చన్నారు. ‘అభివృద్ధి సవాళ్ల ను ఎదుర్కొనేందుకు 2015లో మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించాం. ఎవ్వరూ వెనుకబ డి ఉండకూడదన్నది మన లక్ష్యం. మరి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే ప్రపంచ దేశాల్లో చిత్తశుద్ధి అవసరం. అభివృద్ధికి నిధులు కేటాయించడం అలీనదేశాలకు అత్యంత ముఖ్యం’ అన్నారు.
పర్యావరణంపై మాట్లాడుతూ, భారత్ ఫ్రాన్స్ తో కలిసి ‘సోలార్ అలయెన్స్’ను ఏర్పాటు చేసిం ది. ఇందులో 60దేశాలు భాగస్వామ్యమయ్యాయన్నారు. చౌకలో ఇంధన సమస్యను పరిష్కరించుకోవడం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ఒక మార్గమన్నారు. అణ్వస్త్ర రహిత ప్ర పంచానికి భారత్ కట్టుబడి ఉన్నదన్నారు.సమావేశానికి బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా విదేశాంగ మంత్రి జార్జ్ అర్రెయిజా అధ్యక్షత వహించారు.
చిత్రం..అలీన దేశాల మధ్యంతర మంత్రుల స్థాయ సమావేశంలో సుష్మా స్వరాజ్