అంతర్జాతీయం

గోవా తీరంలో ఉగ్ర ముప్పు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, ఏప్రిల్ 7: ఫిషింగ్ ట్రాలర్ ముసుగులో ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంత దళాలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ హెచ్చరిక నేపథ్యంలో అన్ని ట్రాలర్ల, పడవల యజమానులు అప్రమత్తమయ్యారు. రెప్పవాల్చని రీతిలో 24గంటల నిఘా కొనసాగిస్తున్నారు. లైఫ్ గార్డ్ సర్వీసు ఆపరేటర్లు, షాక్ యజమానులకు ఈ మేరకు రాష్ట్ర టూరిజం శాఖ గట్టి హెచ్చరికలు అందించింది. బీచ్‌లలో జరిగే కార్యకలాపాలు, వ్యక్తుల కదలికలపై అదనపు నిఘా వేసి ఉంచాలని కోరింది. ఈ మేరకు ఇప్పటికే కాసినోలు, ఇతర నౌకలకు హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పడవల యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యామని..అనుమానాస్పద ఉగ్రవాద దాడులకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలని కోరామని అధికారులు తెలిపారు.