అంతర్జాతీయం

లండన్‌లోనూ నిరసనల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: భారత్‌లో జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా, కొన్ని గ్రూపులు ఇక్కడ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. బుధవారం పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన 53 దేశాల ఫ్లాగ్‌పోల్స్‌లో, భారత్‌కు చెందిన జాతీయ పతాకాన్ని కొందరు నిరసనకారులు కిందికి లాగేశారు. దీనిపై మెట్రోపాలిటన్ పోలీసులు వివరణ ఇస్తూ, ‘పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఫ్లాగ్‌పోల్ నుంచి భారత పతాకాన్ని కొందరు కిందికి లాగేశారు. అయితే వెంటనే మరో పతాకాన్ని దానిపై ఉంచాం. సంఘటనపై విచారణ జరుగుతోంది. ఇంతవరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు’ అని వెల్లడించారు. మనదేశానికి చెందిన ప్రముఖ మీడియా ఛానల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు ఒకరు ఖలిస్తాన్ అనుకూల నిరసనకారుల మధ్యలో చిక్కుకుపోయారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న గుంపునుంచి ఆయన్ను రక్షించడానికి స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీనిపై ప్రధాని పర్యటనకు సంబంధించిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ‘జరిగిన సంఘటనపై మేం బ్రిటిష్ అధికార్లకు మా ఆందోళనను తెలియజేశాం. జరిగిన సంఘటనకు వారు క్షమాపణలు చెప్పారు. ఈ విధంగా కొన్ని వర్గాలు ఇబ్బందులు సృష్టించడానికి యత్నిస్తాయని వారికి ముందే చెప్పాం. దీనిపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు, ప్రస్తుతం మరో పతాకాన్ని ఫ్లాగ్‌పోల్‌పై ఉంచారు’ అని తెలిపారు.
యుకె సిక్కు ఫెడరేషన్‌కు చెందిన ఖలిస్తాన్ అనుకూల వర్గాలు, పాకిస్తాన్ మూలాలున్న లార్డ్ అహమ్మద్ నేతృత్వంలోని ‘మైనారిటీస్ ఎగనెస్ట్ మోదీ’ గ్రూపుకు చెందిన 500 మంది నిరసనకారులు, పార్లమెంట్ స్క్వెర్ వద్దకు దూసుకువచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వీరిలో కొందరు కశ్మీర్ వేర్పాటు వాదులు కూడా ఉన్నారు. వీరంతా పార్లమెంట్ స్క్వెర్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం ముందు బ్యానర్లు, జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అయితే ప్రశాంతంగా నిర్వహించే నిరసనలు ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యమేనని, హింసాత్మకరూపం దాల్చరాదని ఆ అధికారి పేర్కొన్నారు.
కాగా బుధవారం కొంతమంది చీరెలు ధరించిన మహిళలు 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద మోదీ అనుకూల నినాదాలు చేశారు. ‘చెక్‌దే ఇండియా’, ‘జై హింద్’ అంటూ వారు నినాదాలు చేశారు. మరోవైపు యుకెకు చెందిన క్యాస్ట్ వాచ్ యుకె మరియు దక్షిణాసియా సాలిడారిటీ గ్రూపులు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

చిత్రం..లండన్‌లో నిర్వహించిన ‘భారత్ కీ బాత్ సబ్ కీ సాత్’ సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ