అంతర్జాతీయం

కామనె్వల్త్‌కు కొత్త సారథి చార్లెస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: మారుతున్న కాలానికి అనుగుణంగా కామనె్వల్త్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో సారథ్య బాధ్యతను బ్రిటన్ యువరాజు చార్లెస్ చేపట్టనున్నారు. 90ఏళ్లు దాటిన ఎలిజిబెత్ రాణి సూచనమేరకు ఆయన వారసత్వానికి ఓటేస్తూ కామనె్వల్త్ ప్రభుత్వాధినేతలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. విండ్‌సర్ క్యాజిల్‌లో జరిగిన కామనె్వల్త్ దేశాల ఆంతరంగిక భేటీలో అన్ని దేశాల మధ్య ఈమేరకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. కామనె్వల్త్ శిఖరాగ్ర సదస్సు దేశాల ప్రభుత్వాధి నేతలు, అధ్యక్షులతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్‌లోని విండ్‌సర్ క్యాజిల్ వ్యాహ్యాళి కేంద్రానికి వెళ్లారు. ఛోగమ్‌గా పేర్కొనే సదస్సులో ప్రభుత్వాధినేతల మధ్య ఎలాంటి అజెండా లేకుండా లాంఛనంగానే చర్చలు జరుగుతాయి.
ఇంతకుముందు జరిగిన సమావేశాల్లో జరిగిన చర్చల సమయంలోఉండే సహాయకులు కూడా వ్యాహ్యాళి సందర్భంగా జరిగే చర్చలకు హాజరుకారు. ఈరకంగా శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా కామనె్వల్త్ దేశాధినేతలంతా వ్యాహ్యాళి కేంద్రానికి తరలి వెళ్లడం అన్నది ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా జరిగే చర్చల్లో అంతర్జాతీయ అంశాల్లో పరస్పర సహకారాన్ని ఏవిధంగా పెంచుకోవాలన్న దానితోపాటు కామనె్వల్త్ ప్రాధాన్యతలపైనా నేతలు మనసువిప్పి మాట్లాడుకుంటారు. అలాగే, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కామనె్వల్త్ కూటమిని ఏవిధంగా తీర్చిదిద్దాలి, పునరుజ్జీవనాన్ని కల్పించాలన్న దానిపైనా చర్చిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 53 దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా హజరుకావడం లేదు. తమ దేశంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ సమవేశాల మధ్యలోనే రామాఫోసా హుటాహుటిన దక్షిణాఫ్రికా తరలి వెళ్లాల్సి వచ్చింది. కాగా, ఈ వ్యాహ్యాళి సందర్భంగా జరిగే చర్చల్లో కామనె్వల్త్ వారసత్వ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
ఇప్పటికే తన కుమారుడు చార్లెస్‌కే కామనె్వల్త్ సారథ్య బాధ్యతను అప్పగించాలని బ్రిటీష్ మహారాణి ఎలిజిబెత్ -2 సూచించిన విషయం తెలిసిందే. ఆమె పిలుపుమేరకు సభ్యదేశాలన్నీ సానుకూల అభిప్రాయానే్న వ్యక్తంచేశాయి. దరిమిలా 69 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్‌కు కామనె్వల్త్ సారథ్యం అప్పగించడం లాంఛనంగా ముగిసింది.
చార్లెస్ సారథ్యంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన భారత్, కామనె్వల్త్‌ను బలోపేతం చేయడానికి ఇప్పటి వరకూ ఆయన చేసిన కృషిని ప్రస్తుతించింది. అయితే, వారసత్వంగా సారథి బాధ్యతలు అప్పగించడం, దాన్ని వ్యవస్థీకృతం చేయడమన్నది ప్రస్తుత పరిస్థితుల్లో అంత సమంజసం కాదన్న అభిప్రాయాన్నీ భారత్ వ్యక్తం చేయడం గమనార్హం. 91ఏళ్ల క్వీన్ ఎలిజిబెత్ భవిష్యత్‌లో జరిగే కామనె్వల్త్ శిఖరాగ్ర సదస్సులకు హాజరయ్యే అవకాశం లేకపోవడంతోనే, ఆమె తన వారసుడిగా కుమారుడైన చార్లెస్‌ను తెరపైకి తెచ్చారు.