అంతర్జాతీయం

మైత్రిలో సరికొత్త మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఏప్రిల్ 22: భారత్, చైనాల మధ్య వివాదాలకు తెరదించి మరింతగా సామరస్యాన్ని, సాన్నిహిత్యాన్ని పెంపొందించేందుకు మరో గట్టి ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27, 28 తేదీల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా వీరిమధ్య ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా విస్తృతంగా చర్చలు జరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఇప్పటివరకూ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలను, విభేదాలను అధిగమించి ద్వైపాక్షిక సంబంధాలను అంతర్జాతీయ అవగాహనను సరికొత్త మలుపు తిప్పాలన్న లక్ష్యంతోనే ఈ చర్చలు జరుగతాయని చెబుతున్నారు. 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ చైనా పర్యటన చేపట్టడం ఇది నాలుగోసారి అవుతుంది. జూన్ 9, 10 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన మరోసారి చైనా వెళ్తారు. పరస్పర సాన్నిహిత్యాన్ని, సమాచార వ్యాప్తిని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇరు దేశాల నేతలు ఈ కీలక భేటీ జరపనున్నట్టుగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఆదివారం నాడిక్కడ ప్రకటించారు. తమ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకే చైనా పట్టణమైన ఊహన్‌ను భారత ప్రధాని మోదీ సందర్శించనున్నారని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో చర్చలు జరిపిన అనంతరం మీడియా భేటీలో వాంగ్ వెల్లడించారు. వ్యూహాత్మక రీతిలో ఇరు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని ఉభయతారకంగా మలుపు తిప్పే ఆలోచనతోనే మోదీ, జీ జిన్‌పింగ్ తాజా శిఖరాగ్ర సదస్సు జరుగుతోందని ఆయన వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో భారత్-చైనా సంబంధాలు ఏ విధంగా ఉండాలి? ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఏ రకంగా ఎదుర్కోవాలన్న దానిపై కూడా మోదీ, జిన్‌పింగ్ చర్చలు కేంద్రీకృతం అవుతాయని వాంగ్ తెలిపారు. ఈ ముఖాముఖీ చర్చల్లో పరస్పర ఆలోచనలను మరింతగా తెలుసుకోవడంతోపాటు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై కూడా మనసు విప్పి మాట్లాడుకునేందుకు వీరిద్దరికీ విస్తృతమైన అవకాశం లభించినట్లు అవుతుందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా నాయకత్వ స్థాయిలో తమ మధ్య ఎంతగా సమావేశాలు, చర్చలు జరిగితే అంతాగానూ దేశాల మధ్య సంబంధాలను విస్తృత రీతిలో పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని, ఆ ఉద్దేశంతోనే వీరిద్దరి మధ్య ఈ శిఖరాగ్ర భేటీ జరగబోతోందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
ఎనిమిది దేశాల షాంఘై కూటమి సమావేశంలో భాగంగా చైనా వచ్చిన సుష్మా స్వరాజ్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. షాంఘై కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఎనిమిది దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం నుంచి రెండు రోజులపాటు సమావేశం అవుతారు.
చిత్రం..బీజింగ్‌లో ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌తో సమావేశమైన
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్