అంతర్జాతీయం

అఫ్గాన్‌లో రక్తపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఏప్రిల్ 22: అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు మరోసారి రక్తపాతం సృష్టించారు. రాజధాని కాబూల్‌లో ఆదివారం ఓ రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి 48మంది ప్రాణాలు బలిగొన్నారు. మరో 112మంది దాడిలో క్షతగాత్రులయ్యారు. అఫ్గాన్‌లో ఎన్నికల సన్నాహక ప్రయత్నాల్లో భాగంగా ఓటరు నమోదు జరుగుతున్న సమయంలో దాడి జరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువ సంఖ్యలోఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దాడి నేపథ్యంలో అక్టోబర్ 20న తొలిదశ ఎన్నికలకు సంబంధించిన భద్రతా పరిస్థితులపైనే ఆందోళన నెలకొంది. వచ్చే ఏడాది జరగనున్న దేశధ్యక్ష ఎన్నికల సన్నాహక ప్రయత్నాల్లో భాగం గా ప్రస్తుతం శాసన ఎన్నికలను నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కేంద్రం ప్రవేశ ద్వారం వద్దే ఐసిస్ మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కాబూల్ పోలీస్ బాస్ తెలిపారు. ఈ దాడికి తామే పాల్పడ్డామని ఐసిస్ అనుబంధ సంస్థ అమాక్ ప్రకటించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటర్లంతా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉండటంతో, భారీ సంఖ్యలో ఓటరు నమోదు కేంద్రానికి ప్రజలు తరలి వచ్చారని అధికారులు తెలిపారు. దాడి అనంతరం ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఈ దాడిపట్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహాన్ని వక్తం చేశాయి. ఐసిస్ మిలిటెంట్ల అమానుషత్వానికి ఈదాడి అద్దం పడుతోందని అమెరికా రాయబారి జాన్ బాస్ అన్నారు. నాటో కూడా దాడిని తీవ్రంగా ఖండించింది.