అంతర్జాతీయం

హిల్లరీ క్లింటన్‌కు భారత్‌నుంచి విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 25: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లిన్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారయిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విరాళాలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత్-అమెరికా అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేయడానికి భారతీయ రాజకీయ నేతలు, సంస్థలనుంచి హిల్లరీ క్లింటన్ భారీఎత్తున ముడుపులు అందుకున్నారని ట్రంప్ మరోసారి ఆరోపించారు. ట్రంప్ గతంలో కూడా హిల్లరీ క్లింటన్‌పై చాలాసార్లు ఇలాంటి ఆరోపణలే చేయగా, ఆమె వాటిని ఖండించారు. అయితే త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ట్రంప్ ఆమెపై విమర్శల జోరు పెంచారు. న్యూయార్క్‌లో గత వారం ట్రంప్ చేసిన ప్రసంగంలో హిల్లరీ క్లింటన్‌పై చేసిన 50కిపైగా ఆరోపణలను ఉటంకిస్తూ ట్రంప్ ప్రచార బృందం విడుదల చేసిన 32 పేజీల బుక్‌లెట్‌లో మరోసారి ఈ ఆరోపణ చేశారు. 2008 సంవత్సరంలో భారత రాజకీయ నాయకుడు అమర్‌సింగ్ క్లింటన్ ఫౌండేషన్‌కు లక్ష డాలర్లనుంచి 5 లక్షల డాలర్ల దాకా విరాళాలు ఇచ్చారంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనాన్ని ఉటంకిస్తూ ట్రంప్ ప్రచార బృందం ఈ ఆరోపణలు చేసింది. అమర్‌సింగ్ చాలాసార్లు అమెరికా వచ్చి అణు ఒప్పందానికి అనుకూలంగా లాబీయింగ్ జరిపారని, అప్పుడు సెనేటర్‌గా ఉండిన హిల్లరీ అణు ఒప్పందాన్ని అడ్డుకోబోమని ఆయనకు హామీ ఇచ్చారని, దానికి కృతజ్ఞతగానే ఆమె ఫౌండేషన్‌కు విరాళాలు ఇచ్చారని ఆ బుక్‌లెట్‌లో పేర్కొన్నారు.