అంతర్జాతీయం

అక్రమ వలసదార్లు ‘జంతువులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదార్లను ‘జంతువులు’ అంటూ డోనాల్డ్ ట్రంప్ వర్ణించారు. అందువల్ల ప్ర తిభావంతులు మాత్రమే అమెరికా కు రావాలని ఆయన గట్టిగా కోరా రు. మెక్సికో, క్యాలిఫోర్నియాలకు చెందిన అధికార్ల సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ తన విద్వేషాన్ని వెళ్లగక్కారు. ఇప్పటివరకు బలహీనంగా ఉన్న వలస చట్టాలను మరింత బలోపేతం చేయాలని గట్టిగా కోరారు. ‘మనదేశంలోకి రావడానికి యత్నిస్తున్నవారు, ప్రవేశిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. వీరి లో చాలామందిని నిలువరిస్తున్నాం. నిజంగా వీరంతా జంతువులు’ అం టూ వైట్‌హౌస్‌లో జరిగిన క్యాలిఫోర్నియా సాం క్చువరీ స్టేట్ రౌండ్‌టేముల్ సమావేశంలో పేర్కొన్నారు. యూఎస్-మెక్సికో సరిహద్దు నుంచి పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్న వలసలను అరికట్టడానికి చట్టాలను మరింత కఠినతరం చేయాలని ట్రంప్ ఎప్పటినుంచో కోరుతూ వస్తున్నారు. ఈవిధంగా వచ్చేవారిలో నేరస్తులు, మత్తుపదార్ధాల రవాణాదార్లు, గ్యాంగ్‌స్టర్‌లు ఉంటున్నారని ఆయన ఆరోపించారు. అందువల్ల క్యాలిఫోర్నియా చట్టాలకు మరింత పదును పెట్టాలని కోరారు.