అంతర్జాతీయం

అరుణాచల్ సరిహద్దుల్లో మైనింగ్ ఆపరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 20: అరుణాచల్ ప్రదేశ్ మరోసారి వార్తలకు ఎక్కింది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దు కలిగి ఉన్న చైనా త్వరలో తన భూభాగంలో భారీ ఎత్తున గనుల తవ్వకం పనులను చేపట్టనుణది. దీంతో ఈ ప్రాంతం మరోసారి భారత్-చైనా మధ్య వివాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చేర్చి ఉన్న తన భూభాగంలో చైనా త్వరలో బంగారం, వెండి తదితర విలువైన ఖనిజాల కోసం మైనింగ్ కార్యకలాపాలను చేపట్టనున్నట్లు హాంకాంగ్‌కు చెందిన చైనా మార్నింగ్ పోస్టు మీడియా కథనం ప్రచురించింది. ఈ ప్రాంతంలో 60 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజాలు ఉన్నట్లు అంచనా. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా అరుణాచలప్రదేశ్‌పై తన పట్టును చాటేందుకు చైనా ఇక్కడ పని కట్టుకుని మైనింగ్ ఆపరేషన్స్‌కు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌ని అని చైనాలో పిలుస్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున వౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు.
ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, మన ప్రధాని నరేంద్రమోదీ మధ్య చర్చలు జరిగిన విషయం విదితమే. గత ఏడాది భారత్, చైనా సరిహద్దులో డొక్లాం ప్రాంతంలో సైనిక విన్యాసాలు జరిగిన విషయం విదితమే. రెండు దేశాల సైనికులు దాదాపు ఎదురెదురుగా వచ్చారు. డొక్లాంపై 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. ఈ ప్రాంతంలో మైనింగ్ ఆపరేషన్ నిర్వహించడం ద్వారా చైనా భారత్‌కు సవాలు విసిరింది. పర్యావరణ పరంగా కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాంతంలో కనీవినీ ఎరుగని విధంగా రోడ్ల నిర్మాణాన్ని చైనా చేపట్టింది. ఇక్కడ పర్వతాల్లో సొరంగ మార్గాలను తవ్వుతున్నారు. మైనింగ్ జరిగే హుంజే ప్రాంతానికి భారీ ఎత్తున ప్రజలను చైనా తరలిస్తోంది. చైనాకు వచ్చే 80 శాతం ఆదాయం మైనింగ్ నుంచి వస్తుంది. ‘సౌత్ చైనా సీ ’ మాదిరిగా ఈ ప్రాంతం ఉద్రిక్తతలకు నిలయంగా మారే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.