అంతర్జాతీయం

నష్టపోయిన సిక్కులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 20: 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన దాడుల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తాను చేయాల్సిందంతా చేస్తుందని సీనియర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలోని మేరీల్యాండ్ శివారులో జరిగిన వైశాఖి వేడుకల్లో పాల్గొన్న వందలాది మంది సిక్కులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి సాధ్యమైనంతవరకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని ప్రకటించగానే, సిక్కులనుంచి మంచి సానుకూల స్పందన లభించింది. అంతేకాదు ఈ అల్లర్లలో పాలుపంచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. 1984 అల్లర్లకు సంబంధించి, జస్టిస్ దింగ్రా కమిషన్ 186 తీవ్రస్థాయి కేసులను పరిశీలిస్తున్నదన్నారు. అనేక ఎఫ్‌ఐఆర్‌లు మళ్లీ నమోదయ్యాయి.
‘నిజానికి నాటి అల్లర్లను దగ్గరుండి ప్రోత్సహించిన నాయకులపై అరెస్ట్ వారంట్లు జారీ అయ్యాయి’ అని వెల్లడించారు. వైశాఖి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఒక సందేశమిస్తూ, ‘విదేశాల్లో వైశాఖి ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా సిక్కుల సంస్కృతీ సంప్రదాయాలు మరింతగా విస్తరిస్తున్నాయనడానికి సంకేతం’ అని పేర్కొన్నారు.