అంతర్జాతీయం

కాశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం చేసుకోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 24: కాశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా ఎటువంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని అమెరికా దక్షిణాసియా దేశ వ్యవహారాల నిపుణుడు అలీస్సా ఐర్స్ స్పష్టం చేశారు. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు మూడవ పార్టీ జోక్యం చేసుకుంటే తమకు సమ్మతమేనని ఇప్పటికే ఇస్లామాబాద్ పలుసార్లు పేర్కొందని, కాని ఈ విషయం పట్ల అమెరికాకు ఆసక్తి లేదన్నారు. భారత్-పాకిస్తాన్‌లు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా నిశ్చితాభిప్రాయమని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాల్లో భారత్ పాత్ర అనే అంశంపై భారత్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ పై వివరాలను వెల్లడించారు. మధ్య ఆసియాలో తలెత్తే ప్రతి సమస్యను అమెరికా పరిష్కరించాలని, ఆ ప్రాంతంలోని దేశాలు కోరుతుంటాయి. కాని మధ్య ఆసియా సమస్యలు వేరు, భారత్-పాక్ మద్య ఉన్న కాశ్మీర్ సమస్య వేరని ఆమె చెప్పారు. కాశ్మీర్ అంశంపై మ ధ్యవర్తిత్వం ఉండాలని ఇస్లామాబాద్ ఆకాంక్షని, కాని ఈ ప్రతిపాదనను భారత్ మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తోందన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే విధం గా పాకిస్తాన్ చర్యలు ఉన్నాయని, ఇది సరైన విధానం కాదన్నారు. ఉగ్రవాదానికి ఊ తం ఇచ్చే విధానాలకు స్వస్తి చెప్పాలని పాకిస్తాన్‌పై అమెరికా మొదటి నుంచి వత్తిడి తెస్తోందన్నారు. పాకిస్తాన్‌లో వేళ్లూనుకున్న ఉగ్రవాదుల వల్ల ఆఫ్గనిస్తాన్‌లోనూ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఆఫ్గాన్‌లో అమెరికా దళాలు ఉగ్రవాద ఏరివేతపనిలో ఉన్నాయన్నారు. అంతర్వుద్ధం వల్ల శిథిలమైన కాబూల్ నిర్మాణంలో భారత్ తో పాటు అనేక దేశాలు భాగస్వామ్యం వహిస్తున్నాయన్నారు. భారత్-పాక్ దేశాలు ఉభయ దేశాల అభివృద్ధి నిమిత్తం వాణిజ్య రంగంపై దృష్టిని సారించాలన్నారు.