అంతర్జాతీయం

2084 నాటికి మరో నాలుగు డిగ్రీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 24: పారిశ్రామిక విప్లవం రాకముందు భూమి ఉష్ణోగ్రతలతో పోలిస్తే మరో నాలు గు డిగ్రీలు పెరిగే అవకాశమున్నదని ఒక అధ్యయనం వెల్లడించింది. 21వ శతాబ్దం ముగియడానికి ముందే ఈ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతుందని స్పష్టం చేసింది. ఈవిధంగా మరో నాలుగు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగితే, రికార్డు స్థాయిలో వేడి గాలులు, పెద్ద ఎత్తున వరదలు, తీవ్రస్థాయి దీర్ఘకాల దుర్భిక్షాలు చోటుచేసుకుంటాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైనె్సస్‌కు చెందిన సీనియర్ పరిశోధకుడు దబాంగ్ జియాం గ్ హెచ్చరించారు. అంతేకాదు వివిధ జీవావరణ వ్యవస్థలు, మానవ వ్యవస్థలు, వివిధ ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని కూడా ఆయ న పేర్కొన్నారు. 2064 నుంచి 2091 మధ్యకాలం లో ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని తమ పరిశోధనల్లో స్పష్టమైందన్నారు.
2184 మధ్యగత సంవత్సరంగా ఉంటుందని, అదే ఏడాది ఉష్ణోగ్రతలు, ఉష్ణమండల ప్రాంతాల్లో తక్కువగా, ధృవప్రాంతాల్లో అధికంగా నమోదవుతాయన్నారు. ఆర్కిటిక్, పసిఫిక్ ప్రాంతాల్లో అధిక వర్షపాతం న మోదవుతుందన్నారు. ఈవిధంగా ఉష్ణోగ్రతల్లో అ త్యధిక తేడా వచ్చినప్పుడు, ప్రపంచ వ్యాప్తంగా, ప్రాంతీయంగా ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు సంభవిస్తాయన్నారు. ఈ మార్పులపై పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.