అంతర్జాతీయం

ట్విట్టర్ ఫాలోవర్స్‌ని బ్లాక్ చేసే హక్కు ట్రంప్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 24: రాజకీయ కారణాలను ఆధారంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ ఖాతాలోని ఫాలోవర్స్‌ని బ్లాక్ చేయరాదని ఫెడరల్ జడ్జి తీర్పులో పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యధికంగా 52 మిలియన్ మంది ఫాలోవర్స్‌ని కలిగి ఉన్న ట్రంప్ తన ట్విట్టర్ అకౌంట్‌ను తన ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన విధాన నిర్ణయాలు వెల్లడించడం, తన అజెండాను వెల్లడించడం, తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడానికి ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ట్రంప్ చేసే ట్వీట్‌లు చూడకుండా ఆయన ఏడుగురి ఫాలోవర్స్ అకౌంట్లను బ్లాక్ చేశారు. అది న్యాయవిరుద్ధమని, అధ్యక్షుడు తమ అకౌంట్లను బ్లాక్ చేసే హక్కులేదని పేర్కొంటూ ఏడుగురు కోర్టును ఆశ్రయించారు. దీనిని న్యూయార్క్ సదరన్ జిల్లా జడ్జి రీస్‌బుచ్‌వల్డ్ విచారించారు. ట్విట్టర్ ఫాలోవర్ వెలిబుచ్చిన రాజకీయ అభిప్రాయాల మీద అతడిని బ్లాక్ చేశారా? లేక అధ్యక్షుడు ట్రంప్ రాజకీయ ఆలోచనలను విభేదించినందుకు అతడిని బ్లాక్ చేశారా? అని జడ్జి ప్రశ్నించారు. అయితే ఈ రెండు ప్రశ్నలకు ‘కాదు’ అనే సమాధానం వస్తుందని, కాబట్టి వారు ట్రంప్ వారి అకౌంట్లను అధికారికంగా బ్లాక్ చేయలేరని బుచ్‌వాల్డ్ తన 75 పేజీల తీర్పులో పేర్కొన్నారు. కాగా ఈ తీర్పును పిటిషనర్లు స్వాగతించారు. కమ్యూనికేషన్ వేదికగా ఉన్న ట్విట్టర్‌పై ప్రభుత్వ సెన్సార్ చెల్లదని దీంతో రుజువైందని పిటిషనర్ల తరఫున కేసు వేసిన కొలంబియా యూనివర్సిటీలోని ఫస్ట్ ఎమెండ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జామీల్ జాఫర్ పేర్కొన్నారు. విమర్శకుల ట్వీట్‌లను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఇంతటితో దీనికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. దీనిని అమెరికా న్యాయ శాఖ అధికారులు విభేదించారు. కోర్టు నిర్ణయాన్ని తాము గౌరవపూర్వకంగా అనంగీకారం తెలుపుతున్నామని అన్నారు. దీనిపై తాము తదుపరి చర్యలు తీసుకుంటామని ఆ శాఖ అధికార ప్రతినిధి కర్రి కుపెక్ చెప్పారు.