అంతర్జాతీయం

రోహింగ్యాలకు భారీ వర్షాల ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోక్స్ బజార్ (బంగ్లాదేశ్): గత తొమ్మిది మాసాలుగా మయన్మార్ నుంచి పారిపోయి వచ్చి కోక్స్ బజార్ జిల్లాలో శరణార్థులుగా ఉంటున్న ఏడు లక్షలమంది రోహింగ్యా ముస్లింలకు వచ్చే వర్షాకాలం పెనుముప్పుగా మారనుంది. మయన్మార్ నుంచి బలవంతంగా వెలివేతకు గురైన వీరు, ఇప్పుడు ప్రకృతి ప్రకోపాన్ని చవిచూసే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి పర్వత సానువుల్లో, దిగువన గుడారాలు, వెదురుతో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కొద్ది రోజులక్రితం ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి కొండ చెరియలు విరిగిపడి ఒక బాలిక మృతి చెందడంతో రోహింగ్యాల్లో అభద్రతాభావం పెరిగిపోయింది.. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థి శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ‘ప్రకృతి ప్రకోపానికి మా కుటుంబ సభ్యులు బలికాక తప్పదు. ఇక్కడ పెద్ద సంఖ్యలోపిల్లలున్నారు. ఎప్పుడు వర్షంపడ్డా కొండచరియల రూపంలో మృత్యువు పొంచి ఉంటోంది,’ అని ఓసియుర్ రెహమాన్ (53) అవేదనతో అన్నాడు. ఇదిలావుండగా ఈ పర్వత ప్రాంతంలో బుల్డోజర్లతో చదును చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. రెండు లక్షల మంది రోహింగ్యాలు ఇప్పుడు ప్రత్యక్షంగా వరద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. వీరిని తరలించేందుకు అవసరమైన భూమి అందుబాటులో లేదు. ఇప్పటివరకు కేవలం 21 వేల మందిని మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. ఈ క్యాంపులు ఉన్న ప్రాంతంలో జూన్ నుంచి ప్రారంభమయ్యే మూడు నెలల కాలలో 2.5 మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇది బ్రిటన్‌లో ఏడాది మొత్తం మీద కురిసే వర్షానికి మూడు రెట్లు అధికం.
గత మూడేళ్లుగా కోక్స్ బజార్ భయంకరమైన తుపాన్లు, భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. వర్షాలు, కొండ చరియలు విరిగిపడిన సంఘటనల్లో వేలాదిమంది బంగ్లాదేశీయులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు శరణార్థులను తరలించేందుకు అవసరమైన సురక్షిత ప్రదేశాలు అందుబాటులో లేవు. ఇదిలావుండగా బంగ్లా ప్రభుత్వం వీరిని త్వరగా మయన్మార్‌కు పంపాలని యోచిస్తుండగా, తాము మాత్రం ఇక్కడినుంచి వెళ్లే ప్రసక్తే లేదని రోహింగ్యాలు తెగేసి చెబుతున్నారు.

చిత్రం..భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతూనే బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్న రోహింగ్యాలు