అంతర్జాతీయం

భారత్‌తో పాక్ గిల్లికజ్జం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 28: ఒకవైపు చర్చలంటూనే పాకిస్తాన్ కొత్త వివాదాలతో భారత్‌ను కవ్విస్తోంది. గిల్‌గిత్-బాల్టిస్తాన్ ప్రాంతం తమదేనని పేర్కొంటూ ఆ దేశం ఇటీవల తమ కేబినెట్‌లో తీర్మానం చేసింది. దీనిపై భారత్ మండిపడుతుండగా, ఈ అంశంపై భారత్ నిరసనలు తెలపడం సమంజసం కాదని పాక్ స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్‌పై గతం నుంచి ఇప్పటివరకు వితండ వాదం చేస్తున్న భారత్ ఇప్పుడు ఈ విషయంపై నిరసన తెలపడమేమిటని ప్రశ్నించారు. గిలిగిత్-పాకిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ ఐదవ ప్రాంతంగా పరిగణించాలని ఈనెల 21న పాకిస్తాన్ కేబినెట్ ఆమోదించింది. అయితే ఆ ప్రాంతం భారత్‌లోనిదని, దానిపై పాక్‌కు ఏమి హక్కుందని పేర్కొంటూ భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ సయ్యద్ హమీద్ షాకు తీవ్ర నిరసన తెలిపింది.
ఈ విషయంలో పాక్ ఎలాంటి చర్యలకు పాల్పడినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. గిలిగిత్-బాల్టిస్తాన్ ప్రాంతం 1947 నుంచి భారత్‌లో విలీనమైన ముఖ్య ప్రాంతమని, దానిపై పాక్‌కు ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసింది. ఏళ్లతరబడి జమ్మూకాశ్మీర్ తమదంటే తమదని రెండు దేశాల మధ్య వివాదం రగులుతోంది. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న ఆ దేశ వాదనను తిప్పికొట్టడానికి పాక్ ఈ కొత్తవివాదాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిందని ఒక అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.