అంతర్జాతీయం

అదనపు ఆధారాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 30: ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ముంబయి దాడి కేసులో పాకిస్తాన్ తన గురివింద ధోరణిని మరోసారి రుజువుచేసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగానే 2008లో ముంబయిపై దాడికి కుట్ర జరిగిందని భారత్ ఇప్పటికే ఎన్నో సాక్ష్యాధారాలు అందించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా అదనపుఆధారాలు కావాలంటూ పాక్ డిమాండ్ చేసింది. లష్కరె తొయిబా కమాండర్ జకీర్ ఉర్ రెహ్మాన్, మరో ఆరుగురితో సంబంధం ఉన్న ఈ కేసులో విచారణ పూర్తికావాలంటే ఈ అదనపు ఆధారాలను అందించాల్సిందేనని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి నఫీజ్ జకారియా స్పష్టం చేశారు. అదనపు ఆధారాలు కోరుతూ భారత్‌కు ఇప్పటికే లేఖ రాశామని, ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నామని మీడియా భేటీలో వెల్లడించారు. ముంబయి దాడి కేసులో లఖ్వీ సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం లఖ్వీని ఏడాది క్రితం బెయిల్‌పై విడుదల చేసింది. మిగతా ఆరుగురు రావల్పిండి జైలులో జైలులోనే ఉన్నారు. గత ఆరేళ్లుగా కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు వాయిదాల మయంగానే కొనసాగుతోంది. ఇప్పుడు అదనపుసాక్ష్యాలు కావాలని పాకిస్తాన్ కోరడం మరింత జాప్యానికేనని చెబుతున్నారు.