అంతర్జాతీయం

మెక్సికన్లను పంపుతా జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 16: ఇటీవల జరిగిన జీ 7 దేశాల శిఖరాగ్ర సదస్సులో తన మాటనెగ్గలేదన్న అక్కసుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సభ్య దేశాలపై చెలరేగిపోయారు. ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ జీ7 సమావేశంలో చోటుచేసుకున్న అంశాలను వెల్లడించింది. జపాన్ ప్రధాని షింజోఅబేను ఉద్దేశించి ట్రంప్ ‘25 మిలియన్న మెక్సికన్‌లు మీ దేశానికి పంపుతా. జాగ్రత్త. నీవుపదవి నుంచి దిగిపోవాల్సిందే’ అంటూ హెచ్చరించారు. సమావేశం ఏకగ్రీవంగా చేసిన ఓ ప్రకటనను ఖరాఖండిగా తోసిపుచ్చిన అమెరికా అధ్యక్షుడు ఇలా విరుచుకుపడినట్టు మీడియా వెల్లడించింది. యురోపియన్ వలసలు ఎక్కువైపోయాయన్న ట్రంప్ జపాన్ ప్రధానిపై చేసిన దురుసు వ్యాఖ్యలతో సమావేశం మందిరం ఒక్కసారి వేడెక్కింది. అంతటితో ఆగక ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మెక్రాన్ ఉద్దేశించి ‘ ఇమ్మానుయెల్ నువ్వు ఇది తెలుసుకో. ఉగ్రవాదులంతా పారిస్‌లోనే ఉన్నారు’ అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తీరుతో జీ 7 శిఖరాగ్ర సమావేశం రసాభాసగా మారిందని జర్నల్ పేర్కొంది. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రడెయూపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. వాడీవేడిగా సాగిన సమావేశం చివరికి వలసలు, ఉగ్రవాదంపై జరిగిన చర్చలపై దృష్టి సారించింది. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం మీడియాపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఫేక్ మీడియా న్యూస్ అంటూ విరుచుకుపడ్డారు. జీ 7 సదస్సుకు సంబంధించి ప్రచురితమైన ఫొటోలను ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు.