అంతర్జాతీయం

అమెరికా, చైనా మధ్య ముదిరిన ట్రేడ్ వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 16: అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అదనపు సుంకాలను చైనా విధించింది. చైనా అమెరికా నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. అమెరికా చైనాకు చెందిన వస్తువులపై 25 శాతం టారిఫ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి ధీటుగా చైనా వెంటనే స్పందించింది. ప్రపంచంలో అమెరికా, చైనాలు పెద్ద ఆర్థిక వ్యవస్థలు. పోటాపోటీగా ఇరు దేశాలు దిగుమతులపై టారిఫ్‌లను పెంచడంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. చైనా మేథోహక్కుల చౌర్యానికి పాల్పడుతూ, వాణిజ్యంలో అనైతిక విధానాలకు పాల్పడుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. అమెరికా చైనా నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. వీటిపై సుంకాలను భారీగా పెంచారు. కాగా చైనా అమెరికా నుంచి 545 వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో వ్యవసాయ ఉత్పత్తులు, వాహనాలు తదితరమైనవి ఉన్నాయి. వీటిపై అదనపుసుంకాన్ని పెంచుతూ ఈనెల 6వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని చైనా పేర్కొంది. కాగా మరో 114 వస్తువులపై త్వరలో సుంకాలు పెంచుతామని, ఎప్పటి నుంచి అమలులోకి వచ్చే విషయం త్వరలో ప్రకటిస్తామని చైనా పేర్కొంది.
ఇందులో వైద్య, ఇంధన పరికరాలు ఉన్నాయి. చైనా విదేశీవాణిజ్య చట్టాలు, పీపుల్స్ రిపబ్లిక్ ఆప్ చైనా రెగ్యులేషన్స్‌కు లోబడి నిర్ణయాలు తీసుకున్నట్లు చైనా పేర్కొంది. అమెరికా తొలిదశలో 34 బిలియన్ డాలర్ల మేర తమ దేశ దిగుమతులపై సుంకం పెంచిందని, దీనికి తగినట్లుగానే తాము అంతేవిలువ వస్తువులపై సుంకాలను పెంచామని, మిగిలిన 16 బిలియన్ డాలర్ల వస్తువులపై త్వరలో సుంకాలు పెంచుతామని చైనా తెలిపింది. ఈ నెల మొదటి వారంలో చైనా, అమెరికా మధ్య బీజింగ్‌లో వాణిజ్య అంశాలపై సమావేశం జరిగింది. కాని ఈ సమావేశంలో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. అమెరికా ఇటీవల జి-7 దేశాల్లోని కెనెడా, మెక్సికో, యూరోపియన్ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలను పెంచిన విషయం విదితమే.