అంతర్జాతీయం

లాహోర్ స్టేడియంలో హఫీజ్ రంజాన్ ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూన్ 16: ముంబయి దాడుల కుట్రదారుడు, కరడు గట్టిన ఉగ్రవాది హఫీజ్ సరుూద్ రంజాన్ సందర్భంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ప్రార్ధనలు నిర్వహించారు. హఫీజ్ ఏర్పాటు చేసిన సంస్థలను పాకిస్తాన్ ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించింది. స్టేడియం వెలుపల,లోపల పోలీసులు, హఫీజ్ అనుచరులు గట్ట్భిద్రతను కల్పించారు. జమాత్ ఉద్ దావాను స్ధాపించిన హఫీజ్ మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ నైతికంగా అండగా నిలబడాలని కోరారు. అమెరికా 2014లోనే జమాత్ ఉద్‌ను నిషేధించి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హఫీజ్ తలకు పదివేల మిలియన్ డాలర్ల వెల కట్టారు. గత ఏడాది పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టాలను సవరించింది. ఉగ్రవాద నిరోధక చట్టం జాబితాలో జమాత్ ఉద్, ఫలహ్-ఇ ఇన్‌సానియత్ ఫౌండేషన్‌లను చేర్చారు. జమాత్ ఉద్‌కు, ముష్కర మూకల సంస్థ లష్కర్ తోయిబాకు మధ్య సంబంధాలు ఉన్న విషయం విదితమే. ముంబయిలో దాడులకు పాల్పడి 166 మంది హత్యకు లష్కర్ తోయిబా కారణమైంది. హఫీజ్ నెలకొల్పిన సంస్థలను నిషేధించినా, దేశంలో ఆయన బహిరంగ ప్రదర్శనలు, సభలను నిర్వహిస్తున్నారు.