అంతర్జాతీయం

‘ఈద్’ ఇద్దర్నీ కలిపింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బటీకోట్ (ఆఫ్గనిస్తాన్), జూన్ 16: బాంబు పేలుళ్ల మోత.. ఫిరంగుల దాడులతో నిత్యం యుద్ధవాతావరణ ఉండే తూర్పు ఆఫ్గనిస్తాన్‌లో శనివారం ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నంగర్‌హర్ రాష్ట్రంలోని బటీకోట్ జిల్లాలో తాలిబన్ తీవ్రవాదులు, ఆఫ్గనిస్తాన్ భద్రతా సిబ్బంది ఒకర్నొకరు ఆలింగనం చేసుకోవడంతోపాటు సెల్ఫీలు దిగారు. ముస్లింల పర్వదినం ఈద్ రెండోరోజూ ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాయి. దేశంలోనే అతి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ తాలిబన్‌కు చెందిన మిలిటెంట్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనెడ్ రాకెట్లు, అత్యాధునిక ఆయుధాలతో కూడిన వాహనం, మోటర్ బైక్‌పై బటీకోట్‌లోని సైనిక శిబిరం వద్దకు చేరుకున్నారు. ఆఫ్గనిస్తాన్, తాలిబన్ పతకాలు చేబూని మరీ సైనికులతో కరచాలనం చేశారు. ఒకర్నొకరు ఆలింగనం చేసుకున్నారు. సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఆ ప్రాంతంలో ఇంతకు ముందెన్నడూ అలాంటి వాతావరణ కనిపించలేదు. తారసపడితే దాడులు, చంపేసుకోవడాలు జరిగే చోట మిలిటెంట్లు, సైనికులు ఈద్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆలింగనాలు చేసుకోవడం స్థానికులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసింది. గ్రామస్తులు ఎగబడి మరీ చూశారు. ‘జవాన్లు, పోలీసులు మా సోదరులే. వారికి ఈద్ శుభాకాంక్షలు చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని తాలిబన్ కమాండర్ బాబా చెప్పాడు. కాల్పుల విరమణ కొనసాగించమని హైకమాండ్ ఆదేశిస్తే దానే్న పాటిస్తామని అతడు వెల్లడించాడు. ‘మేం ఇస్లామిక్ రాజ్యం, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం’ అని బాబా తెలిపాడు. అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు దేశాన్ని వదిలి వెళితేనే ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని తాలిబన్ కమాండర్ అన్నాడు. అమెరికా ఇక్కడ ఉన్నంతకాలం యుద్ధం తప్పదని హెచ్చరించాడు. ఈద్ పండుగ సందర్భంగా తాలిబన్ సంస్థ కాల్పుల విరమణను ప్రకటించింది. ఆఫ్గనిస్తాన్ భద్రతాదళాలపై ఎలాంటి కవ్వింపు, కాల్పులు జరపబోమని మిలిటెంట్లు తెలిపారు. మూడు రోజుల పాటు తుపాకీలు ముట్టమని ప్రతిజ్ఞ చేశారు. అయితే నాటో, అమెరికా దళాలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ కాల్పుల విరమణపై ఇంతకు ముందే ఓ ప్రకటన చేశారు. తాలిబన్లపై పోలీసులు, సైన్యం ఎలాంటి కాల్పులకు దిగరని ఆయన వెల్లడించారు. అయితే ఐఎస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. అంతర్జాతీయ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మిలిటెంట్లపై దాడులు కొనసాగుతాయన్నారు. తాలిబన్, భద్రతాదళాల కాల్పుల విరమణ నిర్ణయం పరస్పరం గౌరవించుకునేదిగా ఆఫ్గనిస్తాన్ అంతరంగిక శాఖ సహాయ మంత్రి మసూద్ అజీజ్ అన్నారు. బటీకోట్ కీలకమైన జిల్లా. ఇక్కడ నుంచి హైవే జలాలాబాద్, టోర్ఖహంను కలుపుతుంది. అలాగే పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని హైవే వెళ్తుంది. తాలిబన్, భద్రతాదళాలు సెల్ఫీలన్నీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
చిత్రం..రంజాన్ సందర్భంగా తూర్పు కాబూల్‌లో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్న తాలిబన్ ఉగ్రవాదులు