అంతర్జాతీయం

నెదర్లాండ్స్‌లో ఘనంగా యోగా దివస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమ్‌స్టర్‌డామ్, జూన్ 17: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అతి పెద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని భారత ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం ప్రారంభించారు. నగరంలోని మ్యూజియంప్లెయిన్ (మ్యూజియం స్క్వేర్) వద్ద, భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంత భారీ స్థాయిలో నిర్వహించడం ఇదే మొదటిసారి. డచ్ వౌలిక సదుపాయాలు, జలాల వినియోగ శాఖ మంత్రి కొరా వాన్ న్యూవెన్‌హుజెన్, నెదర్లాండ్స్‌లో భారత రాయబారి వేణు రాజమోని కూడా హాజరైన యోగా వేడుకలు రవి శంకర్ సంప్రదాయ రీతిలో జ్యోతి ప్రజ్వలం చేయడంతో మొదలయ్యాయని భారత రాయబార కార్యాలయం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి హాజరైన వేలాది మంది తొలుత భారతీయ యోగా రీతులను అభ్యసించారు. అనంతరం, కొంత సేపుధ్యానం చేశారు. ఆతర్వాత రవి శంకర్ యోగా విధివిధానాలపై ఉపన్యసించారు. భారతీయ నృత్యం రీతుల ప్రదర్శన, సంగీత విభావరి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ యోగా గురువు జొహాన్ నూర్లూస్ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు జరిగాయి. ఆమ్‌స్టర్‌డామ్‌లోని డాల్ఫిన్ వెల్‌నెస్ కేంద్రానికి చెందిన పాటీ జొగెనె్మట్ ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నారులకు యోగా తరగతులు నిర్వహించా. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రమోషనల్ స్టాల్స్‌లో డార్జిలింగ్, అస్సాం, సిక్కిం, నీలగిరి తదితర రకాలకు చెందిన టీని ఆస్వాదించే అవకాశం ప్రజలకు లభించింది. ‘ది సోల్ శాంతి కన్సర్ట్’ పేరుతో చివరిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో ప్రముఖ వాయిలిన్ విద్వాంసుడు సుబ్రమణియమ్, బాలీవుడ్ గాయని కవితా కృష్ణమూర్తి తదితరులు ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వనె్నతెచ్చారు. 2015 నుంచి 2017 వరకు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఆర్ట్ ఆప్ లివింగ్ సంస్థ హేగ్ నగరంలో నిర్వహించింది. ఈ ఏడాది నెదర్లాండ్స్‌ను వేదికంగా ఎంచుకుంది.

చిత్రం..అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆమ్‌స్టర్‌డామ్
(నెదర్లాండ్స్)లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్