అంతర్జాతీయం

రూ.కోట్ల ఆస్తి.. కారు మాత్రం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 28: ఇద్దరు పాకిస్తాన్ మాజీ ప్రధానులకు సొంతంగా కార్లు కూడా లేవట! కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా, కారు మాత్రం తమకు లేదని మాజీ ప్రధానులు యూసుఫ్ రజా గిలానీ, జఫారుల్లా ఖాన్ జమాలీ తమ అఫిడవిట్లలో పేర్కోవడం విచిత్రం. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు సీనియర్ నాయకులు సమర్పించిన అఫిడవిట్లలో నిబంధనల ప్రకారం తాము, తమ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల సమాచారాన్ని అంద చేశారు. గిలానీ తన ఆస్తుల విలువను 7.75 కోట్ల రూపాయలుగా చూపించారు. కానీ, కారు లేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అదే విధంగా జమాలీ కూడా తనకు కారు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దేశంలోని అతి సంపన్నులైన రాజకీయ నాయకుల్లో ఒకడైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో-చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ సైతం తన పేరితో కారు లేదని అఫిడవిట్‌లో తెలిపారు. అతని నికర ఆస్తి 1.54 కోట్ల రూపాయలు. 30 లక్షల రూపాయల విలువైన ఆయుధాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. అయితే, బిలావల్ తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ వద్ద ఆరు బులెట్‌ప్రూఫ్ కార్లు ఉన్నాయి. అదే పార్టీకి చెందిన మరో నాయకుడు, సింధ్ ప్రావీన్స్ మాజీ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా మాత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి తన వద్ద మొత్తం 17 కార్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు. రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తన వద్ద కారు లేదని డిక్లరేషన్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం 3.38 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ, కారు మాత్రం లేదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నాయకురాలు మరియం నవాజ్ సైతం 84.50 కోట్ల రూపాయల ఆస్తిని చూపించినప్పటికీ, తనకు ఒక్క కారు కూడా లేదని స్పష్టం చేసింది. ఇదే పార్టీకి చెందిన పంజాబ్ ప్రావీన్స్ మాజీ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ కుమారుడు హమ్జా షాబాజ్ ఆస్తుల విలువ 41.12 కోట్ల రూపాయలు. అయితే, ఆయనకు కూడా సొంత కారు లేదు. జమాత్ ఏ ఇస్లామీకి చెందిన సైరాజుల్ హక్, జమాయిత్ ఉలేమా ఏ ఇస్లాం చీఫ్ వౌలానా ఫజ్లుర్ రహమాన్ వద్ద కూడా సొంత కార్లు లేవు. అవామీ నేషనల్ పార్టీ చీఫ్ అస్ఫాంద్ యార్ వాలీ ఖాన్ ఆస్తులు 4.01 కోట్ల రూపాయలు. ఆయన వద్ద కాలం చెల్లిన 1988 మోడల్ టయోటా కొరొలా కారు మాత్రమే ఉంది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా, ఒక్క కారు కూడా ఈ నేతలు సమర్పించిన అఫిడవిట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.