అంతర్జాతీయం

ఆ సర్వే అత్యంత దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 28: భారత్‌లో మహిళలకు ఎలాంటి రక్షణాలేదంటూ ఓ సర్వేలో పేర్కొనడంపై కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆక్షేపణ తెలిపారు. థామ్‌సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వేలో భారత్‌లో మహిళలకు భద్రత లేదని నివేదించింది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా ప్రపంచంలోనే భారత్ ముందుందని సర్వే పేర్కొంది. ఆఫ్గనిస్తాన్, సిరియా, పాకిస్తాన్ కంటే భారత్‌లోనే దారుణమైన పరిస్థితులున్నాయన్న రాయిటర్ సర్వేపై శశిథరూర్ మండిపడ్డారు.‘సర్వే నివేదిక అత్యంత దారుణం, దుర్మార్గం’అని ఆయన అన్నారు. ఒక్క భారత్‌లోనే మహిళపై దారుణాలు జరుగుతున్నట్టు చెప్పడం, ప్రమాదకర జాబితాలో చేర్చేయడం సరైందికాదని చెప్పారు. ‘ఇటీవల దేశంలో మహిళపై కొన్ని దురాగతాలు జరుగున్నాయి. దీనికి భారతీయులందరూ సిగ్గుపడాలి. పురుషులు కూడా సిగ్గుపడాల్సిందే’అని థరూర్ పేర్కొన్నారు. ఇండో-అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ అనే ఎన్జీవో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి ‘్భరత్‌లో మహిళకు ఎంతో స్వేచ్ఛ ఉంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదు’అని స్పష్టం చేశారు. ఆఫ్గనిస్తాన్, సౌదీ అరేబియా తదితర దేశాల మాదిరిగా భారత్‌లో మహిళలపై ఎలాంటి ఆంక్షలూ లేవని శశిథరూర్ వెల్లడించారు. ప్రపంచంలో అనేక దేశాల కంటే భారత్‌లోనే మహిళలకు స్వేచ్ఛ, భద్రత ఉందని ఆయన అన్నారు. సర్వేలో పేర్కొన్నట్టు భారత్‌లో మహిళలు ఎలాంటి హింసనూ ఎదుర్కోవడం లేదని ఆయన తెలిపారు. రాయిటర్స్ ఫౌండేషన్ సంస్థ ఆన్‌లైన్ సర్వేలో 548 మంది అభిప్రాయలు సేకరించింది. భారత్‌లోనే మహిళలపై లైంగిక హింస, దాడులు ఎక్కువని ప్రపంచంలోనే అత్యంత ‘ప్రమాదకర’ దేశంగా పేర్కొంటూ ఓ నివేదిక వెల్లడించింది. నిత్యం యుద్ధవాతావరణం, అనిశ్చిత పరిస్థితులున్న ఆఫ్గనిస్తాన్, సిరియాలంటే భారత్‌లోనే మహిళల పరిస్థితి దారుణమని సర్వే హెచ్చరించింది. మార్చి 26, మే 4 మధ్య సర్వే జరిపినట్టు నిర్వాహకులు వెల్లడించారు. సోమాలియా, సొదీ అరేబియా దేశాలకు నాలుగు, ఐదు ర్యాంకులు ప్రకటించి భారత్‌కు జాబితాలో మొదటి ర్యాంకు ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. ఐరోపా, ఆఫ్రికా, యుఎస్, సౌత్ ఈస్ట్ ఆసియా, సౌత్ ఆసియా, పసిఫిక్‌లో ఆన్‌లైన్ సర్వే నిర్వహించారు. పాశ్చాత్య దేశమైన అమెరికా మూడో స్థానంలో ఉంది. కాగా ఈ సర్వేపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముక్కూమొహం లేని వారి అభిప్రాయలతో సర్వే జరపడమేమిటని నిలదీసింది. అదో తప్పుల తడకగా పేర్కొంది.