అంతర్జాతీయం

వలసవాదుల నివాస హక్కును తిరస్కరించిన బ్రిటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 29: అత్యంత నైపుణ్యం గల వందలాది మంది భారతీయులు సహా పలుదేశాలకు చెందిన వారు దేశంలో నివసించే హక్కులను నిరాకరిస్తూ యూకె ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని ఆ దేశం సమర్థించుకుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి వచ్చిన అత్యంత నిపుణులవర్గమైన టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తాము చెల్లించే పన్ను రికార్డులను బట్టి బ్రిటన్‌లో శాశ్వతంగా నివసించే హక్కును తొలగించేందుకు ఉద్దేశించిన టైర్-1 వీసా కేసులకు సంబంధించి ఆ దేశం బహిరంగ సమీక్ష నిర్వహించింది. మొదటి విడత సమీక్ష నిర్వహించిన అనంతరం ఆ దేశ మంత్రి కరోలిన్ నోక్స్ హోమ్ అఫైర్స్ సెలక్ట్ కమిటీకి ఒక లేఖ రాస్తూ యుకె ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లోని 322(5) ప్రకారం దేశంలోని వలసవాదుల నివాసహక్కులను తిరస్కరించే హక్కు ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 38 కేసులను సమీక్షించి వాటిని తిరస్కరించినట్టు చెప్పారు. కాగా మంత్రి చర్యపట్ల అత్యంత నిపుణులైన వలసవాదుల వర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా, మిగిలిన 1671 కేసులకు సంబంధించిన ఫిర్యాదులను కూడా ఒక వారంలో సమీక్షించవచ్చునని భావిస్తున్నారు.