అంతర్జాతీయం

వాయు కాలుష్యంతో మధుమేహం ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 30: మనిషి జీవనశైలిలో వచ్చే మార్పులే మధుమేహం(డయాబిటిక్) వస్తుందని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చాం. వైద్యులూ అదే చెబుతూ వచ్చారు. అయితే వాయు కాలుష్యం కూడా మధుమేహం రావడానికి కారణమవుతోందని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. 2016లో మధుమేహం వచ్చిన వారిని పరిశీలిస్తే ప్రతి ఏడుమందిలో ఒకరికి వాయుకాలుష్యంవల్లే వ్యాధి సంక్రమించినట్టు తేలింది. లైఫ్‌స్టయిల్, తీసుకునే ఆహారం, ఎక్కువసేపుకూర్చుని ఉండేవారిలోనే డయాబెటిక్ వచ్చే అవకాశాలుంటాయని అనుకుంటాం. ఇప్పుడు చూస్తే కాలుష్యం కూడా కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధనల్లో తెలిసింది. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు శాస్తవ్రేత్తల పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. 2016లో ప్రపంచ వ్యాప్తంగా 3.2 మిలియన్ల మంది మధుమేహం బారిన పడ్డారు. మొత్తంగా 14 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి.‘మధుమేహం రావడానికి వాయు కాలుష్యం కూడా కీలక పాత్ర పోషిస్తుందని మా పరిశోధనల్లో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా దీనిపై మేం అధ్యయనం చేశాం’అని సీనియన్ ఫ్యాకల్టీ జియాద్ అల్ అలే తెలిపారు. శరీరంలో ఇన్సులేషన్‌ను కాలుష్యం తగ్గించేస్తోందని ఆయన చెప్పారు. లానె్సట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్‌లో ఈ విషయాన్ని ప్రచురించారు. కాలుష్యం తీవ్రత తగ్గించడం ద్వారా వ్యాధి నిరోధకాన్ని పెంచుకోవచ్చని ఆయన తెలిపారు.