అంతర్జాతీయం

తెలివితేటలను నిర్ధారించే పరికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 30: మీరు ఎంత తెలివైన వారో తెలుసుకోవాలంటే మీకు వివిధ రాతపరీక్షలు, వౌఖిక పరీక్షలు పెట్టి మీ సామర్థ్యం తెలుసుకోనక్కర్లేదు. మీ తెలివితేటల శాతమెంతో తెలుసుకోవాలంటే మీ మెదడును ఒక్కసారి పరీక్ష చేస్తే చాలు నిమిషంలో మీగురించి అంచనా వేయవచ్చు. అమెరికాకు చెందిన కొందరు శాస్తవ్రేత్తలు కృత్రిమ మెధో విధానాన్ని అభివృద్ధి చేసి ఒక కొత్త పరికరాన్ని కనుగొన్నారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్రత్తవేత్తల బృందం మనిషి ఐక్యూని నిర్ధారించడానికి ఫంక్షనల్ మేగ్నటిక్ రీసోనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) ద్వారా మనిషి మెదడును స్కాన్ చేస్తారు. స్కాన్ సమయంలో మెదడు ఏ విధమైన ఆలోచనలు లేకుండా ప్రశాంత స్థితిలో ఉండాలి. ఈ స్థితిలో మెదడులోని నిర్దేశిత ప్రాంతాలకు నాళాల ద్వారా రక్తం సరఫరా అయ్యే పరిస్థితిని ఈ పరికరం ద్వారా విశే్లషిస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ పద్ధతిలో సేకరించిన డాటాను 900 విభాగాల్లో పూర్తిస్థాయిలో విశే్లషించి మనిషి మేధస్సు స్థాయిని లెక్కకడతామని ఇనిస్టిట్యూట్‌కు చెందిన రాల్ప్ అడాల్ఫ్ తెలిపారు. సుమారు 900 మందిని ఈ విధంగా పరీక్షించి వారి మేధోస్థాయిని అంచనా వేసినట్టు ఆయన చెప్పారు. దీనిని ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.