అంతర్జాతీయం

పోలీసు బస్సులపై తాలిబన్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జూన్ 30: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో గురువారం తాలిబన్ తిరుగుబాటుదారులు పోలీసు బస్సులపై చేసిన బాంబు దాడిలో 27 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు. పోలీసులను తీసికెళ్తున్న బస్సుల కాన్వాయ్‌పై ఈ దాడి జరిగిందని అఫ్గానిస్తాన్ హోంశాఖ తెలిపింది. తిరుగుబాటుదారులు పేల్చిన భారీ పేలుళ్లలో 14 మంది నేపాలీ సెక్యూరిటీ గార్డులు మృతి చెందిన సుమారు పది రోజులకే మళ్లీ ఈ దాడి జరిగింది. దాడి పేలుడు వల్ల సంభవించిందా లేక ఆత్మాహుతి దాడా లేక కారుబాంబు దాడా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో పోలీసు బలగాలను కాబూల్ పశ్చిమ శివార్లకు తరలిస్తుండగా ఈ దాడి జరిగిందని ఆయన వివరించారు. అయితే తాము ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించాడు. ఈ దాడిలో అనేక మంది మృతి చెందారని, గాయపడ్డారని అతను పేర్కొన్నాడు. సంఘటన స్థలం వద్దకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదని, అక్కడ భారీగా భద్రతాధికారులు మోహరించి ఉన్నారని ఎఎఫ్‌పి విలేఖరి చెప్పారు. అయిదు గ్రీన్ పోలీస్ కేడెట్ బస్సులతో పాటు వాటికి ఎస్టార్టుగా ఉన్న ఒక మిలిటరీ వాహనం ధ్వంసమయినట్టు కనిపిస్తోందని అతను వివరించారు. కాబూల్‌లో ఈ నెల 20న నేపాల్ సెక్యూరిటీ గార్డుల బస్సుపై తాలిబన్లు జరిపిన దాడిలో అందులోని 14 మంది మృతి చెందిన తరువాత నేపాలీ జాతీయులు అఫ్గానిస్తాన్‌లో పనిచేయకుండా నేపాల్ నిషేధం విధించింది.