అంతర్జాతీయం

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంపై వెల్లువెత్తిన నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్‌లాండ్: డొనాల్డ్ ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానం అమెరికాలో తీవ్ర దుమారం రేపుతున్నది. ప్రత్యేకించి అమెరికా-మెక్సికో సరిహద్దులో వందలాది మంది పిల్లలను నిర్బంధించి, వారివారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన విధానాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. శనివారం అమెరికాలోని పలు నగరాల్లో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ తీరును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీలు జరిగాయి. ప్రత్యేకించి ఇమ్మిగ్రేషన్ పట్ల ఉదారంగా వ్యవహరించే న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌తోపాటు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి బలం ఉన్న వయోమింగ్, అపలాచియా నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేపట్టారు. ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న అమ్మిగ్రేషన్ విధానాలను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అధికారికంగా ఏ రాజకీయ పార్టీ దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో జరిగిన ర్యాలీలను నిర్వహించలేదు. సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల నష్టపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, మెక్సికో సరిహద్దులో అక్రమ చొరబాట్ల పేరుతో వందలాది పిల్లలను వారి కుటుంబాలకు దూరం చేయడాన్ని సహించలేకపోతున్న సామాజిక కార్యకర్తలు ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీలు జరగడం విశేషం. మధ్య తరగతి పౌరులు, గృహిణులు, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేని తటస్థులు ఈ ర్యాలీలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తిరుగుబాటు చేయాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, తాను రాజకీయ కార్యకర్తను కూడా కాదని పోర్ట్‌లాండ్‌లో జరిగిన ర్యాలీకి కో-ఆర్గనైజర్‌గా వ్యవహరించిన కాటే షరిఫ్ స్పష్టం చేసింది.
ఇమ్మిగ్రేషన్ విధానాన్ని పూర్తిగా మార్చేసి, కొత్తగా అమలు చేస్తున్న విధానాలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ఆమె పేర్కొంది. సరిహద్దును దాటి వచ్చారన్న పేరుతో చిన్నారులను అధికారులు అరెస్టు చేయడాన్ని సమర్థించలేకపోక పోతున్నానని, అందుకే, ఈ విషయంలో తన వంతు పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. జాతీయ డెమోక్రాటిక్ వర్కర్స్ అలియన్స్‌కు పొలిటికల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న జెస్ మొరలెస్ రొకెటో మాట్లాడుతూ, అమెరికాలో ఈతరహా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పింది. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేస్తున్నామని, శనివారం దేశ వ్యాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపినిస్తే, వారే స్వచ్ఛందంగా ప్గాన్నారని తెలిపింది. అమెరికా పౌర హక్కుల యూనియన్, మూవ్‌ఆన్.ఓఆర్‌జీ, నేషనల్ డెమోక్రాటిక్ వర్కర్స్ అలియన్స్, ది లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ తదితర సంస్థలు ఈ ర్యాలీలకు పూర్తి మద్దతునిచ్చాయి. ట్రంప్ తన విధానాలను మార్చుకునే వరకూ నిరసన వ్యక్తం చేస్తునే ఉంటామని, పోర్ట్‌లాండ్ ర్యాలీలో పాల్గొన్న వారు స్పష్టం చేశారు.