అంతర్జాతీయం

ఆత్మాహుతి దళం దాడి..12మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలాలాబాద్, జూలై 10: అఫ్గానిస్తాన్ భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనంపై ఒక ఆత్మాహుతి దళం సభ్యుడు దాడి చేసిన సంఘటనలో దాదాపు 12 మంది దుర్మరణం చెందారు. వీరిలో చాలావరకు సాధారణ పౌరులు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు ధాటికి జలాలాబాద్ ఈశాన్య ప్రాంతంలోని పెట్రోలు బంకు సమీపంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని సంబంధిత అధికార ప్రతినిధి అట్టాల్లాహ్ ఖొగ్యానీ తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..పెద్ద మంటతో కూడిన బంతి వంటి ఆకారం స్థానికులపైకి ఎవరో విసిరినట్టు గ్రహించారు. ఈనెల 1వ తేదీన కూడా ఆత్మాహుతి దళం అఫ్గాన్‌లోని సిక్కులు, హిందువులు ఉన్న సమూహంపై జరిపిన భారీ దాడుల్లో 19 మంది మరణించగా, మరో 21 మంది గాయపడ్డారు. కాగా, గత కొన్ని వారాలుగా అత్యాధునిక ఆత్మాహుతి బాంబులతో ఈ ప్రాంతంలో దాడులకు తెగబడుతున్నారని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తెలిపింది. అమెరికా, అఫ్గానిస్తాన్ దళాలు నిరంతరం దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆత్మాహుతి దళం కూడా ప్రత్యక్ష దాడులకు సిద్ధపడుతోందని పేర్కొంది. ఈ సందర్భంగా యూఎస్ స్టేట్ సెక్రెటరీ మైక్ పోంపెయో మాట్లాడుతూ అఫ్గాన్, కాబూల్ ప్రభుత్వాలతో త్వరలో జరుపనున్న చర్చల్లో శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 17 ఏళ్ల తర్వాత అఫ్గాన్ భద్రతా బలగాలు, తాలిబన్ మిలిటెంట్ల మధ్య జరిగే చర్చల ద్వారా శాంతియుత వాతావరణ పరిస్థితులు చూస్తామన్న ఆశాభావాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చలు ఇరు దేశాలకు మేలు చేకూర్చుతాయని తాము విశ్వసిస్తున్నామని యూఎస్ స్టేట్ సెక్రెటరీ మైక్ పొంపెయో, అఫ్గానిస్తాన్ ప్రెసిడెంట్ అష్రాఫ్ ఘని ఇక్కడ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.