అంతర్జాతీయం

ఏటా ఓ చికాగో కట్టాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూలై 12: భారత్‌లో 2030 నాటికి పట్టణ జనాభా శాతం 40 శాతానికి పెరుగుతుందన్న అంచనా ఉంద ని, దానిని అందుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక కొత్త చికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉందని కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి చెప్పారు. ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి పొలిటికల్ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక అంచనా ప్రకా రం 2030 నాటికి భారత్‌లోని 600 మిలియన్ల ప్రజలు పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారని, వారి అవసరాలను తీర్చడానికి యుఎన్ ప్రతిపాదించిన అభివృద్ధి అజెండాను అమలు చేయడానికి ఇప్పటినుంచే చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. 700 నుం చి 900 మిలియన్ల చదరపు మీటర్ల స్థలాన్ని పట్టణ ప్రాంతాలకు ప్రతి ఏటా కేటాయించాలన్నారు. మరోమాటలో చె ప్పాలంటే ఇప్పటినుంచి 2030 వరకు కొత్త చికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉందన్నారు. అమెరికాలోని న్యూయార్కు, లాస్‌ఏంజె ల్స్ తర్వాత మూడో పెద్ద నగరమైన చికాగోలో 2.7 మిలియన్ల మంది 606.4 చదరపు కి.మీ. విస్తీర్ణంలో నివసిస్తున్నారని చెప్పారు. దీంతో పోలిస్తే భారత్‌లోని పట్ట ణ ప్రాంతాలకు ఇంకా 70శాతం వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. తాము 2030 నాటికి అభివృద్ధి అనే లక్ష్యం తో కృషిచేసి, దానిలో విజయవంతమైతే అంతర్జాతీయంగా భారత్ ఉన్నత స్థితిలో నిలుస్తుందన్నారు. ప్రస్తు తం భారత్‌లో 30శాతం మంది అనగా, 1.2 బిలియన్ల మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, 1947 నాటికి ఇదే సంఖ్య 17శాతం మాత్ర మే ఉండేదని చెప్పారు. ప్రజలకు భద్రత, నివసించే పరిస్థితులు కల్పించడం ద్వారా నూతన పట్టణాలను నిర్మించవచ్చునని చెప్పారు. ప్రపంచంలోనే పెద్దవైన కొన్ని పథకాలను భారత్ అమలు చేస్తోందని, ఇవి ఆర్థిక ప్రగతి, పరిసరాల శుభ్రత, సా మాజిక అంశాలతో ముడిపడి ఉన్నాయన్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో కొన్ని సవాళ్లను తమ దేశం ఎదుర్కొంటోందని, అందులో ముఖ్యమైనవి అందరికీ ఇళ్లు కల్పించడమని చెప్పారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం, రవాణా సౌకర్యం, పౌరులకు సేవలందించడం తమ ముందున్న సవాళ్లని చెప్పారు. పట్టణీకరణను లక్ష్యంగా దృఢనిశ్చయంతో ముందుకు సాగుతామన్నారు. 2050 నాటికి 35శాతం పట్టణ జనాభా లక్ష్యంగా చైనా, నైజీరియా వంటి దేశాలు ముందుకు పోతున్నాయని, తాము కూడా కొన్ని నిర్దేశిత లక్ష్యాలతో ముందుకుపోతూ 2030 నాటికి పట్టణీకరణ చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని మంత్రి వివరించారు.